(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
రైల్వేలో జర్నలిస్టుల రాయితీ పథకాన్ని పునరుద్ధరించాల్సిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.జర్నలిస్టులలో చాలా వరకు తక్కువ,మధ్య తరగతి ఆదాయ వర్గాలకు చెందిన వారేనని,తమ విధి నిర్వహణలో భాగంగా ప్రతినిత్యం రైళ్లలో ప్రయాణాలు చేస్తుంటారన్నారు.ఎంపీ వద్దిరాజు రాజ్యసభలో గురువారం మాట్లాడుతూ,కోవిడ్ కారణంగా ఎత్తేసిన రాయితీ పథకాన్ని తిరిగి ప్రవేశపెడుతూ వారిపై ఆర్థిక భారం పడకుండా సాయం చేయాల్సిందిగా రైల్వే మంత్రిత్వ శాఖను కోరారు.రైలు ప్రయాణాల సందర్భంగా గతంలో మాదిరిగా 50% రాయితీని పునరుద్ధరించాల్సిందిగా పాత్రికేయులు,వారి సంఘాలు మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తుండడాన్ని ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు గుర్తు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్థంభంగా సమాజానికి తమ విలువైన సేవలందిస్తున్న జర్నలిస్టులకు రైల్వే టిక్కెట్లలో 50% రాయితీ కల్పించడమనేది సమంజసం,సముచితమని ఎంపీ రవిచంద్ర చెప్పారు.అలాగే, రాజ్యసభలో మాట్లాడిన తర్వాత ఎంపీ వద్దిరాజు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను పార్లమెంటులోని ఆయన ఛాంబర్ లో కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేయగా,ఆయన వెంటనే సానుకూలంగా స్పందిస్తూ అధికారులకు తగు ఆదేశాలిచ్చారు.
రైల్వేలో జర్నలిస్టుల రాయితీ పథకాన్ని పునరుద్ధరించాలి
Recent Comments
Hello world!
on