ఇజ్రాయిల్ కుటుంబానికి న్యాయం చేయాలి
ఇజ్రాయిల్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి
సిట్టింగ్ జడ్జితో న్యాయవిచరణ జరిపించి
నిందితులను కఠినంగా శిక్షించాలి
ఇజ్రాయిల్ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే పరామర్శించకపోవడం బాధాకరం
మంచితనానికి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఇజ్రాయిల్
సీనియర్ న్యాయవాది ఇజ్రాయిల్ చిత్రపటానికి నివాళులు అర్పించిన
మాదిగల జాగృతి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అందుగుల సత్యనారాయణ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివగళ్ళ యాదయ్య
కందుకూరు, (ప్రజా కలం)
ఇజ్రాయిల్ కుటుంబానికి న్యాయం చేయాలని మాదిగల జాగృతి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అందుగుల సత్యనారాయణ డిమాండ్ చేశారు. మాదిగల జాగృతి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అందుగుల సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివగళ్ళ యాదయ్య
ఇజ్రాయిల్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీనియర్ న్యాయవాది ఇజ్రాయిల్ ను దుండగులు హత్య చేయడం జరిగింది. ఇజ్రాయిల్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి వారికి న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇజ్రాయిల్ మంచితనానికి మారుపేరు కష్టాల్లో ఉన్న వారందరికీ ఏదో రకంగా తన వంతు సహాయం చేస్తూ అందరికీ మంచితనంగా నిలబడి అందరికీ న్యాయం చేసిన చివరకు తనకు మాత్రం అన్యాయం జరగడం బాధాకరమని సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మృతి చెందిన ఇజ్రాయిల్ కుటుంబాన్ని పరామర్శించకపోవడం బాధాకరంగా ఉందన్నారు.ప్రతి చిన్న విషయానికి ఎవరు పిలిచిన వచ్చే సబితమ్మ ఎందుకు వచ్చి పరామర్శించలేదని సత్యనారాయణ ప్రశ్నించారు.గతంలో సబితమ్మ కోసం ఎంతగానో కష్టపడ్డ ఇజ్రాయిల్ కుటుంబాన్ని నేడు పరామర్శించకపోవడం
బాధాకరమన్నారు. ఇజ్రాయిల్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటామని సత్యనారాయణ అన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం చేయకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిందితులను పట్టుకొని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాదిగల జాగృతి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అందుగుల సత్యనారాయణ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివగళ్ళ యాదయ్య, రాష్ట్ర కోశాధికారి పుట్టగల జగన్, తుక్కుగూడ మున్సిపల్ అధ్యక్షుడు కప్పల రాజు, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సమతా ప్రకాష్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇజ్రాయిల్ కుటుంబానికి న్యాయం చేయాలి
Recent Comments
Hello world!
on