Thursday, April 10, 2025
Homeతెలంగాణకలెక్టరేట్ లో ఉచిత మధ్యాహ్న భోజనాన్ని దివ్యాంగులు ఉపయోగించుకోవాలి.. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*

కలెక్టరేట్ లో ఉచిత మధ్యాహ్న భోజనాన్ని దివ్యాంగులు ఉపయోగించుకోవాలి.. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*

*కలెక్టరేట్ లో ఉచిత మధ్యాహ్న భోజనాన్ని దివ్యాంగులు ఉపయోగించుకోవాలి.. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*
*కలెక్టరేట్ లో దివ్యాంగ అర్జీదారులకు ఉచిత మధ్యాహ్న భోజనం.*
ఖమ్మం మార్చి 05( ప్రజా కలం న్యూస్)
ఖమ్మం జిల్లా ప్రతినిధి రాయబారపు రమేష్.
ఖమ్మం నగరంలోని బుధవారం
కలెక్టరేట్ కు వివిధ పనుల నిమిత్తం వచ్చే దివ్యాంగులకు కల్పించిన ఉచిత మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని ఉపయోగించు కోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
బుధవారం జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి కలెక్టరేట్ లో దివ్యాంగ అర్జీదారులకు కోసం ఏర్పాటు చేసిన ఉచిత మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ 40 రోజుల క్రితం ప్రజావాణి లో వచ్చిన అభ్యర్థన మేరకు జిల్లా అధికారులతో చర్చించి దివ్యాంగ అర్జీదారులకు ఉచిత మధ్యాహ్న భోజనం కల్పించాలని నిర్ణయానికి వచ్చామని అన్నారు. జిల్లా కలెక్టరేట్ కు వచ్చే దివ్యాంగులకు ఇది వారి కలెక్టరేట్ అనే భావన కల్పించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు.
ప్రజలందరికి సేవ చేసేందుకే అధికారులు ఉన్నారని, ముఖ్యంగా సమాజంలో వెనుక బడిన వారికి, దివ్యాంగులకి, బలహీన వర్గాల వారికి సహాయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజావాణి కార్యక్రమం, వివిధ పనులపై ఎప్పుడు కలెక్టరేట్ కు దివ్యాంగులు వచ్చిన క్యాంటీన్ లో ఏర్పాటు చేసిన ఉచిత మధ్యాహ్న భోజనాన్ని ఉపయోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు.
రాబోయే 3 నెలల కాలంలో ప్రతి దివ్యాంగుడికి తప్పనిసరిగా యూ.డి.ఐ.డి. కార్డు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లా కలెక్టరేట్ లోని క్యాంటీన్ లో సదరం సర్టిఫికెట్, యూ.డి.ఐ.డి. కార్డుతో టోకెన్ పొందిన వారికి ఉచితంగా మధ్యాహ్న భోజనం కల్పిస్తామని అన్నారు. జిల్లా కలెక్టరేట్ ఖమ్మం నగరానికి కొంత దూరంలో ఉన్న నేపథ్యంలో దివ్యాంగులకు ఇబ్బందులు కలగవద్దని ఈ ఏర్పాటు చేశామని, నాణ్యమైన భోజనాన్ని క్యాంటీన్ ద్వారా అందిస్తున్నామని, ఒక భోజనంపై 80 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
దివ్యాంగులను అతిథులుగా భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టరేట్ కు వచ్చిన దివ్యాంగులందరికి ఉచిత భోజనం అందుతుందని, ఎవరిని తిరస్కరించడం ఉండదని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments