మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన తాజా చిత్రం “LYF – Love Your Father” ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసేందుకు సిద్ధంగా ఉంది. పవన్ కేతరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ హర్ష కథానాయకుడిగా, కశికా కపూర్ కథా నాయికగా, మరియు ప్రముఖ గాయకుడు S.P.చరణ్ కథానాయకుడి తండ్రి పాత్రలో నటించారు.
ఈ సినిమా లో “హే మధుమతి” పాటను ఇటీవల మల్లా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, మెయిన్ క్యాంపస్ లో చామకూర షాలిని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “మా స్టూడెంట్ శ్రీ హర్ష ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
దర్శకుడు పవన్ కేతరాజు సినిమా పై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “ఈ సినిమా అద్భుతంగా వచ్చింది, మార్చి చివరివారంలో ప్రేక్షకుల ముందుకు వెండి తెరపైకి రానుంది” అని చెప్పారు.
హీరో శ్రీ హర్ష మాట్లాడుతూ, “మణిశర్మ గారు ఈ సినిమాలో సంగీతం అద్భుతంగా అందించారు. ఈ సినిమా కుటుంబంతో కలిసి చూడదగినది” అని అన్నారు.
ఈ చిత్రంలో భద్రం, షకలక శంకర్, నవాబ్ షా, రఘు బాబు, ప్రవీణ్, ఛత్రపతి శేఖర్, జబర్దస్త్ శాంతి కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమా యొక్క సాంకేతిక బృందంలో కెమెరా మెన్ – శ్యామ్ .కే. నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ – మణిశర్మ, మరియు నిర్మాతలు కిషోర్ రాఠీ, ఎ. సామ్రాజ్యం
“LYF – Love Your Father” అనేది కుటుంబ సంబంధాలను, ప్రేమను సమర్థవంతంగా చూపించే ఒక కుటుంబ కథా చిత్రం. మార్చి చివరివారంలో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుంది.
“LYF – Love Your Father” ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసేందుకు సిద్ధం
Recent Comments
Hello world!
on