Friday, April 4, 2025
Homeతెలంగాణమాంసాహారులకు అత్యుత్తమ మైనది మధూస్ హెర్బల్ చికెన్

మాంసాహారులకు అత్యుత్తమ మైనది మధూస్ హెర్బల్ చికెన్

మాంసాహారులకు అత్యుత్తమ మైనది మధూస్ హెర్బల్ చికెన్
-యన్.యం.ఆర్.ఐ.డైరెక్టర్ డాక్టర్ యస్.బి.బర్బుద్దే
హైదరాబాద్ :మార్చి 6:(ప్రజా కలం
యాంటీబయాటిక్స్ లేకుండా వినియోగదారులకు సురక్షితమైన ,రుచికరమైన మరియు పోషకాలతో కూడిన చికెన్ అందించటానికి మధూస్ హెర్బల్ చికెన్ వారు చేస్తున్న కృషి అభినందనీయమని ఐసిఎఆర్-నేషనల్ మీట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ యస్.బి.బర్బుద్దే అన్నారు.గురువారం ఉదయం హైదరాబాద్ లోని ఐసిఎఆర్ నేషనల్ మీట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో జరిగిన మధూస్ హెర్బల్ చికెన్ ప్రారంభం గా జరిగిన సాంకేతిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఆకలి సూచికలో 125 దేశాలలో భారతదేశం 111 వ స్థానంలో ఉండటం భారత జనాభా యొక్క పోషక అవసరాలను పెంచాల్సిన అవసరాన్ని సూచిస్తుందని అన్నారు.మాంసంతో సహా జంతు ఆధారిత ఆహారాలు ప్రోటీన్,విటమిన్ మరియు ఖనిజ అవసరాలను తీర్చడంలో సహాయపడతాయని ఈ సందర్భంగా ఆయన వివరించారు.మాంసం ఉత్పత్తి,ప్రోససింగ్ మరియు వినియోగ సాంకేతికత ల ద్వారా ఆధునిక వ్యవస్థీకృత మాంసం రంగం అభివృద్ధికి సంస్థ చేస్తున్న కృషిని,వివిధ కార్యకలాపాల గురించి కూడా ఆయన వివరించారు.వ్యవసాయ వ్యాపార ఇంక్యుబేటర్ ప్రిన్సిపల్,సైంటిస్ట్ మరియు పిఐ డాక్టర్ యం.ముత్తు కుమార్ పరిశుభ్రమైన మాంసం ఉత్పత్తి యొక్క ప్రాముఖ్యత ,విలువ జోడింపు ,పశువుల సరఫరా గొలుసులో వ్యవస్థాపకులు మరియు స్టార్టప్ లకు అందుబాటులో ఉన్న అవకాశాలపై ప్రజంటేషన్ ఇచ్చారు.ఇంక్యుబేషన్ కార్యక్రమం ద్వారా వారందరికీ మద్దతు లభిస్తుందని ఆయన తెలియచేసారు.విలువలతో కూడిన వ్యాపారం చేయటం తన నైజం అని ప్రజలకు ఆరోగ్యకరమైన చికెన్ అందించటానికి అనేక ప్రయోగాల అనంతరం ఈ హెర్బల్ చికెన్ ను అందుబాటులోకి తెచ్చామని మధూస్ హెర్బల్ ఫార్మ్స్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ వసంతు మధుసూదన్ రెడ్డి అన్నారు.ఇందుకు విశేష కృషి చేసిన పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ పౌల్ట్రీ రీసెర్చ్ స్టేషన్ హైదరాబాద్ ప్రొఫెసర్ గుర్రం.శ్రీనివాస్ మరియు ముఖ్యంగా మాకు సలహాలు సూచనలు ఇస్తూ మాకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన ఐసిఎఆర్-యన్ యం ఆర్ ఐ డైరక్టర్ డాక్టర్ యస్.బి.బర్బుద్దే గారికి అలాగే సైంటిస్ట్ డాక్టర్ ముత్తు కుమార్ గారికి ఆయన ధన్యవాదాలు తెలియచేసారు.మధూస్ హెర్బల్ చికెన్ పెంచే విధానం యాంటీబయాటిక్స్ లేకుండా ఫైటో బయాటిక్స్ తో కూడిన మూలికల సమాహారంతో పూర్తి శాఖాహరం ఇస్తూ ఎలా మధూస్ హెర్బల్ చికెన్ తయారు చేస్తున్నది అలాగే ఐసిఎఆర్-యన్ యం ఆర్ ఐ నిబంధనలకు అనుగుణం గా చేస్తున్న ప్రాసెసింగ్ విధానాన్ని గురించి మధూస్ హెర్బల్ చికెన్ సి ఈ ఓ యస్.వి.రామప్రసాద్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు మేధావులు ,విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అభినందించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments