Monday, April 7, 2025
Homeక్రైమ్మహేశ్వరం ప్రెస్ క్లబ్ కమిటీ ఎన్నిక

మహేశ్వరం ప్రెస్ క్లబ్ కమిటీ ఎన్నిక

మహేశ్వరం ప్రెస్ క్లబ్ కమిటీ ఎన్నిక
మహేశ్వరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కట్టె కొమ్ముల జగన్ రెడ్డి
ప్రధాన కార్యదర్శిగా పుంజాల హేమంత్ గౌడ్
జర్నలిస్టు సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తా
విలువలతో కూడిన జర్నలిజానికి అందరూ కృషి చేయాలి
మహేశ్వరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కట్టె కొమ్ముల జగన్ రెడ్డి

మహేశ్వరం,(ప్రజా కలం)
జర్నలిస్టు సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని మహేశ్వరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా జగన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పుంజాల హేమంత్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలంలో బుధవారం నాడు మహేశ్వరం మండల జర్నలిస్టులు అందరూ కలిసి మహేశ్వరం జర్నలిస్టుల మండల కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. మహేశ్వరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా కట్టే కొమ్ముల జగన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా హేమంత్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహేశ్వరం సీనియర్ జర్నలిస్టులు ఒత్తుల రఘుపతి, దోమ యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రఘుపతి,యాదగిరి రెడ్డి మహేశ్వరం జర్నలిస్టులు అందరికీ పలు సూచనలు చేశారు. సీనియర్ జర్నలిస్టుల సలహా తీసుకుంటూ విలువలతో కూడిన జర్నలిజానికి కృషి చేయాలని అన్నారు.
త్వరలో మహేశ్వరం ప్రెస్ క్లబ్ పూర్తి కమిటీని
ఏర్పాటు చేస్తామని తెలిపారు. జగన్ రెడ్డి, హేమంత్ మాట్లాడుతూ మహేశ్వరం జర్నలిజం సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి తమ కృషి నిరంతరం చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆంధ్ర జ్యోతి వేముల కృష్ణ, సాక్షి రాజ్ కుమార్, మన తెలంగాణ మూడావత్ కబీర్, సూర్య పాల జనార్దన్, ప్రజా తంత్ర గాజుల నర్సింహా రావు ,ప్రజా కలం తడక నర్సింహా, టి న్యూస్ శ్రీను, హెచ్ఎంటీవీ సాయి ,సామాజిక తెలంగాణ బంటు వెంకటేష్ , క్రైమ్ మిర్రర్ వెంకటేష్,
ఐ డి టీవీ రాజేశ్వరి, మహా టీవీ పి నర్సింహా
సివిఆర్ భీమ్లా నాయక్ ,ఐ న్యూస్ రాఘవేందర్ చారి ,దిశ ప్రశాంత్,సాక్షి అబిలాష్, నగర నిజం ఒత్తుల భాస్కర్, ఆదాబ్ హైదరాబాద్ ప్రభాకర్, ఏ బి ఎన్ సంతోష్, నవ తెలంగాణ శేఖర్, మన తెలంగాణ సుదీర్,ఎన్ టీవీ కేదార్ ,6 టీవీ రాజేష్, 99 టీవీ ప్రవీణ్,వన్ టీవీ రాము,అక్షర విజేత చంద్రశేఖర్, రాజ్ న్యూస్ రాజేందర్ ,వార్త మిర్రర్ సంతోష్,బిగ్ టీవీ శివ, విశ్వంబర నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments