- పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
మెట్ పల్లి ప్రతినిధి, మార్చి 18 (ప్రజాకలం) :పరిశుధ్య కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ అన్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన సదస్సు నిర్వహించి హెల్త్ చెకప్ చేశారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల హెల్త్ చెకప్ చేయడం జరుగుతుందని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉండాలని పారిశుద్ధ్య పని ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్,ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, వైద్యులు డాక్టర్ వాణి,యు పి హెచ్ సి,ఏ అశోక్,డి పవన్ కుమార్, బి అనూష, బి శారద, లాస్య, శంకర్, రాజేష్, రవి, రాజమణి పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు.