నాడు నాటారు …నేడు నరికారు…
హరితహారం చెట్లను కొట్టివేసిన విద్యుత్ అధికారులు
గొల్లపెల్లి మార్చి23 ప్రజాకలం ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలలో హరితహరం ఒకటి హరిత హారం కార్యక్రమంలో భాగంగా గొల్లపెల్లి మండల వెనుగుమట్ల గ్రామంలోని జగిత్యాల – వెల్గటూర్ ప్రధాన రహదారికి ఇరువైపులా గతంలో మొక్కలు నాటారు. ఆ మొక్కలు ఇప్పుడు ఏపుగా పెరిగి వృక్షాలుగా మారాయి దీంతో రోడ్డుకు ఇరువైపులా హరితవనంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రయాణికులను కనువిందు చేస్తూ ప్రకృతిని ఆస్వాదించేలోపే ఆ చెట్లను నరికి వేస్తున్నారు. గ్రామ శివారులో విద్యుత్ తీగలకు చెట్లు తగులుతుండడంతో విద్యుత్ అధికారులు చెట్లను కొట్టివేశమని చెప్తున్నారు. అధికారులు ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలు నాటడం అవి పెరిగి వృక్షాలుగా అవడం చెట్లను ప్రతి సారి విద్యుత్ అధికారులు నరికివేస్తున్నట్టు ప్రజలు అంటున్నారు . దీంతో ప్రజాదనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రజాప్రతినిధులు,నాయకులు అధికారుల పై మండి పడుతున్నారు దీంతో అధికారుల తీరు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
నరికివేయకముందు ఏపుగా పెరిగిన చెట్లు