Friday, April 4, 2025
Homeక్రైమ్పరువు హత్య కాదు..కుట్రపూరిత హత్య

పరువు హత్య కాదు..కుట్రపూరిత హత్య

పరువు హత్య కాదు..కుట్రపూరిత హత్య
*సాయి కుమార్ హంతకులను కఠినంగా శిక్షించాలి
*కేసు విచారణకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి
*మృతుని కుటుంబానికి రూ. కోటి ఎక్స్ గ్రేషియో చెల్లించాలి
-పౌరహక్కుల, ప్రజా సంఘాల డిమాండ్
పెద్దపల్లి,మార్చి 31:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో మార్చి 27న ప్రేమ పేరుతో హత్య కాబడ్డ పూరెళ్ళ సాయి కుమార్ ది పరువు హత్య కాదని, కుట్రపూరితంగా చేసిన హత్యేనని పౌరహక్కుల, విప్లవ రచయితల సంఘం,తెలంగాణ ప్రజా ఫ్రంట్, దళిత లిబరేషన్ ఫ్రంట్ నాయకులు ఆరోపించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన అనంతరం మృతుని కుటుంబ సభ్యులతో వివరాలు సేకరించారు.అనంతరం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమారస్వామి,దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడీ సుదర్శన్,తెలంగాణ ప్రజా ఫ్రంట్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ గుమ్మడి కొమురయ్య మాట్లాడుతూ ముప్పిరితోట గౌడ కులంకు చెందిన పూరెళ్ల పరుశరాములు-జ్యోత్స్నల కొడుకు సాయి కుమార్ పదవ తరగతి పూర్తి చేసి డ్రైవర్ గా పనిచేస్తున్నాడని,అదే గ్రామం ముదిరాజ్ కులానికి చెందిన ముత్యం సమత-సదయ్యల కూతురు గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని నిజనిర్ధారణ తేలిందని వివరించారు.ఈ ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల సభ్యులకు,గ్రామస్తులకు ముందే తెలుసున్నారు.అమ్మాయి చదువు పూర్తయిన తర్వాత పెళ్లిచేసుకుందాం అని అనుకుంటున్న క్రమంలో ప్రేమ వ్యవహారం, పెళ్లి ఇష్టం లేని అమ్మాయి తల్లిదండ్రులు ముత్యం సదయ్య,సమత,రంగాపూర్ గ్రామానికి చెందిన అమ్మాయి మేన మామ సిద్ద సారయ్య,అదే గ్రామానికి చెందిన చీకటి మల్లయ్య అతని కొడుకు చీకటి హరీష్ ల ప్రోధ్భలంతో హత్యకు కుట్రాపన్నారని పేర్కొన్నారు.స్నేహితులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సాయి కుమార్ ను విచక్షణ రహితంగా గొడ్డలితో నరికి చంపారని తమ విచారణలో తేలిందన్నారు.గతంలో రెండు సార్లు సాయి కుమార్ పై దాడి జరిగినా పోలీసులు స్పందించలేదని,హరీష్ కు తన కూతరును ఇచ్చి పెళ్లి జరిపించాలని కుట్రతో సాయి కుమార్ ను చంపారని ఇది ముమ్మాటికీ పరువు హత్య కాదన్నారు.ప్రేమ పేరుతో జరిగిన ఈ హత్యను పౌరహక్కుల సంఘం,విప్లవ రచయితల సంఘం, తెలంగాణ ప్రజా ఫ్రంట్,దళిత లిబరేషన్ ఫ్రంట్ లుగా ప్రజా సంఘాలుగా ఖండిస్తున్నామని అన్నారు.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయి తల్లిదండ్రులు ముత్యం సదయ్య – సమత,మేనమామ సిద్ద సారయ్య,చీకటి మల్లయ్య,హరీష్ లలో ముగ్గురిని మాత్రమే అరెస్ట్ చేసారని కీలక వ్యక్తులు చీకటి మల్లయ్య,హరీష్ లను ఇంత వరకు అరెస్ట్ చేయలేదని వారు ఆరోపించారు.సమాజంలో ప్రేమ,కులం,మతం పేరుతో జరిగే పరువు హత్యలు,దాడుల నివారణకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రజలు,యువత, విద్యార్థులలో మార్పు తీసుకురావడం కోసం గ్రామ,మండల,జిల్లా స్థాయి వరకు ప్రజలు,ఉన్నతాధికారులు పోలీసులు, ప్రజాసంఘాలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ సమస్యలపై ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించాలని డిమాండ్ చేశారు. అధికార,ప్రతి పక్ష పార్టీలు ఈ ఘటనలకు భాద్యత వహించాలన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం ముప్పిరితోట ఘటనపై సమగ్ర విచారణ జరిపించి హంతకులను కఠినంగా శిక్షించాలని,మిగితా ఇద్దరినీ వెంటనే అరెస్ట్ చేయాలన్నారు.కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేయాలని,సాయి కుమార్ కుటుంబానికి ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీపతి రాజగోపాల్,విప్లవ రచయితల సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య, పౌరహక్కుల సంఘం నాయకులు బొంకూరి లక్ష్మణ్,ఎన్.సత్యనారాయణ,పుట్ట రాజన్న,రెడ్దిరాజుల సంపత్ పాల్గొన్నారు.

మృతుడు సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్షించిన పౌరహక్కుల సంఘం నాయకులు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments