*పరువు కోసం ప్రాణం తీశాడు*
పుట్టినరోజు నాడే యువకుడి ప్రాణాలు బలిగొన్న ప్రేమ
పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య
పెద్దపల్లి, మార్చి 28:(ప్రజాకరం జిల్లా ప్రతినిధి)
పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో గురువారం రాత్రి దారుణ హత్య జరిగింది.17 ఏళ్ల సాయికుమార్ గౌడ్ అనే యువకుడు తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సమయంలో,అదే గ్రామానికి చెందిన ఓ యువతి తండ్రి సదయ్య గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు.సాయికుమార్,సదయ్య కుమార్తె గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.ఈ విషయం తెలుసుకున్న సదయ్య,వారి ప్రేమను వ్యతిరేకించాడు.గురువారం రాత్రి సాయికుమార్ పుట్టినరోజు కావడంతో,తన స్నేహితులతో కలిసి గ్రామం శివారులో వేడుకలు జరుపుకుంటున్నాడు.ఈ విషయం తెలుసుకున్న సదయ్య,అక్కడికి చేరుకుని సాయికుమార్ పై గొడ్డలితో దాడి చేశాడు.తీవ్రంగా గాయపడిన సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పెద్దపల్లి ఏసిపి కృష్ణ,సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,నిందితుడిని అరెస్టు చేశారు.ఈ దారుణ హత్యతో ముప్పిరితోట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.పుట్టినరోజు నాడే సాయికుమార్ హత్యకు గురికావడం,గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
పరువు కోసం ప్రాణం తీశాడు
Recent Comments
Hello world!
on