అర్ధరాత్రి జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ
జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ అర్ధరాత్రి సమయంలో కోరుట్ల, మెట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు.
మెట్ పల్లి ప్రతినిధి, మార్చి 14 (ప్రజాకలం) (రిపోర్టర్: మహ్మద్ అజీమ్) :అర్ధరాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్, గస్తీ పరిస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించారు. అనంతరం మెట్ పల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీడీ బుక్‌ను పరిశీలించారు. ఆ సమయంలో స్టేషన్‌లో ఉన్న సిబ్బంది వివరాలు, విధులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి డ్యూటీ వివరాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు .