మెట్ పల్లి సర్కిల్ ఆఫీస్ లో ఘనంగా హోలీ వేడుకలు
మెట్ పల్లి ప్రతినిధి, మార్చి 14 (ప్రజాకలం) (రిపోర్టర్: మహ్మద్ అజీమ్) :హోలీ పండగ సందర్బంగా మెట్ పల్లి పోలీస్ స్టేషన్లో అధికారులు, సిబ్బంది ఒకరిపై ఒకరు రంగులు వేశారు. చల్లుకొని హోలీ వేడుకలను సాంప్రదాయ బద్ధంగా జరుపుకున్నారు. సీఐ కార్యాలయం వద్ద పోలీస్ సిబ్బంది సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై కిరణ్ కుమార్ లను కలసి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.