– పెద్దపూర్ మల్లన్న జాతరకు భారీ బందోబస్తు.
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి, మార్చి 15 (ప్రజాకలం) (రిపోర్టర్: మహ్మద్ అజీమ్) :కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దపూర్ లోని మల్లన స్వామి పెద్దపూర్ జాతర సందర్బంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని భక్తులకు భద్రత విషయంలో అందం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎస్పీ జాతర ఏర్పాట్లను సమీక్షించి, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, పార్కింగ్ సౌకర్యాలు, అత్యవసర సేవలు, పోలీసు బందోబస్తు వంటి వాటిని అందజేశారు. అంశాలను పరిశీలించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు పోలీసు సిబ్బందిని కెమెరా ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీస్ బృందాలు శాంతి పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు.భక్తుల భద్రత, పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.ప్రతి ఒక్కరు పోలీసుల సూచనలు పాటించి, శాంతి భద్రతలు కాపాడేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ మల్లన స్వామిని దర్శించుకున్నారు.ఎస్పీ వెంట డీఎస్పీ రాములు, సీఐ సురేశ్, ఎస్.ఐలు శ్రీకాంత్, శ్యామ్ రాజ్, నవీన్ ఉన్నారు.