Friday, April 4, 2025
HomeHeadlinesఅందుబాటులో ఉండి సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తా. మెట్ పల్లి సీఐ అనిల్ కుమార్...

అందుబాటులో ఉండి సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తా. మెట్ పల్లి సీఐ అనిల్ కుమార్ మెట్ పల్లి సిఐ బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్.

అందుబాటులో ఉండి సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తా.

మెట్ పల్లి సీఐ అనిల్ కుమార్

మెట్ పల్లి సిఐ బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్.

మెట్ పల్లి ప్రతినిధి, మార్చి 24 (ప్రజాకలం):నిరంతరం పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని మెట్ పల్లి సిఐ గా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన మెట్ పల్లి సీఐ కార్యాలయంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మెట్‌పల్లి ప్రజలకు శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.
మెట్‌పల్లిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలన్నారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రజలు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా యువకులు అతివేగంగా వాహనాలు నడపకుండా జాగ్రత్త వహించాలని కోరారు.సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఆన్‌లైన్ మోసాలకు గురికాకుండా వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. మహిళల భద్రతకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు.మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా నేరుగా తనను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. ప్రజల సహకారంతో మెట్‌పల్లిలో శాంతిభద్రతలను పరిరక్షించడానికి కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని అనిల్ కుమార్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments