ఇజ్రాయిల్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు
ఇజ్రాయిల్ కుటుంబానికి 5 ఎకరాలభూమి గవర్నమెంట్ ఉద్యోగం కల్పించాలి
కందుకూరు చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహాలకు ర్యాలీ నిర్వహించిన
మాదిగల జాగృతి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అందుగుల సత్యనారాయణ
సీనియర్ జర్నలిస్టు జేఏసీ చైర్మన్ ఒత్తుల రఘుపతి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివగళ్ళ యాదయ్య
కందుకూరు, మార్చి 28,(ప్రజా కలం)
ఇజ్రాయిల్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని మాదిగల జాగృతి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అందుగుల సత్యనారాయణ అన్నారు. ఇజ్రాయిల్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కందుకూరు చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల ఆత్యాకు గురైన ఇజ్రాయిల్ కుటుంబానికి న్యాయం చేయాలని న్యాయం చేసే వరకు మాదిగల పోరాటం చేయడం జరుగుతుందన్నారు. దళితులపై దాడులు జరుగుతున్న పట్టించుకునే నాధుడే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా గొంతు గద్దర్ ఉంటే ప్రశ్నించే గొంతుక లేకపోయేసరికి అందరూ అనాధలకు మిగిలారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాదిగల మందిరం మూకుమ్మడిగా ఇజ్రాయిల్ కుటుంబానికి జరిగే వరకు ఐక్యమత్యంగా పోరాటం చేస్తామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సబితమ్మ వెంటనే ఇజ్రాయిల్ కుటుంబానికి న్యాయం చేయాలని లేనిపక్షంలో మహేశ్వరం నియోజకవర్గంలో తిరగకుండా అడ్డుకుంటామని మాదిగల జాగృతి సేవా సంఘం హెచ్చరించింది.
ఇజ్రాయిల్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు
Recent Comments
Hello world!
on