ఫోటో : నెంబర్ ప్లేట్ బిగించిన ఆర్డీవో వాహనం.
తన వాహనానికి నెంబర్ ప్లేట్ వేయించిన ఎల్లారెడ్డి ఆర్డీవో…
ఎల్లారెడ్డి మార్చ్ 13 ప్రజా కలం ప్రతినిధి : గత ఫిబ్రవరి 20వ తేదీన ప్రజా కలం దినపత్రికలో *కలెక్టర్ వాహనానికి వర్తించిన నిబంధనలు… ఆర్డీవో వాహనానికి వర్తించవా?* అనే శీర్షికన వార్త కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ వార్త కథనంలో ఎల్లారెడ్డి ఆర్ డి ఓ వెహికల్ ముందు భాగంలో నెంబర్ ప్లేట్ ఉన్నప్పటికిని రెవెన్యూ డివిజనల్ అధికారి అని ఎరుపు రంగుతో కూడిన బోర్డు ఏర్పాటు చేశారు. కానీ వెనుక భాగంలో నెంబర్ ప్లేట్ లేకుండా రూ.13,590 కూడిన 14 పెండింగ్ చలాన్లు ఉన్న విషయంపై ప్రజా కలం పత్రికలో వార్త రాయడం జరిగింది. ఇందుకు స్పందించిన ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్ తన వాహనానికి వెనుక భాగంలో నెంబర్ ప్లేట్ బిగించడం విశేషం. కానీ ఆ వాహనంపై ఉన్న 14 పెండింగ్ చలాన్లు మాత్రం చెల్లించకపోవడం విచారకరం. సాధారణ ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారులే తమ వాహనంపై పెండింగ్ చలాన్లు చెల్లించక పోవడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.