Friday, April 4, 2025
HomeUncategorizedఘనంగా రంజాన్‌ వేడుకలు

ఘనంగా రంజాన్‌ వేడుకలు

ఘనంగా రంజాన్‌ వేడుకలు
– మసీదులు, ఈద్గాల వద్ద ముస్లిం మైనార్టీల ప్రత్యేక ప్రార్థనలు
– ముస్లిం మైనార్టీలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు

మెట్ పల్లి, (కోరుట్ల) ప్రతినిధి మార్చి 31 (ప్రజా కలం) : మెట్ పల్లి, కోరుట్ల పట్టణాల్లో సోమవారం రంజాన్ పండుగను ముస్లిం మైనార్టీ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. రెండు పట్టణాల్లోని మసీదుల్లో, పట్టణ శివారుల్లోని ఈద్గాల వద్ద ముస్లిం మైనార్టీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వేడుకల్లో కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, డాక్టర్ సత్యనారాయణ, మాజీ ఎంపీపీ మారు సాయి రెడ్డి చంద్రశేఖర రావు, కిషోర్, కొమిరెడ్డి శీను, బుచ్చిరెడ్డి, ఆకుల ప్రవీణ్, వెంకటేశ్, ఓజ్జల శీను,కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జట్టి లింగం, కొమిరెడ్డి కరం,మాజీ సర్పంచ్ పూదరి నర్సాగౌడ్, ఎర్రోళ్ల హనుమాన్లు, నామ రాజయ్య, మాజీ సర్పంచ్ కొమిరెడ్డి లింగారెడ్డి, పుప్పాల లింబాద్రి, మున్సిపల్ సానిటేషన్ ఇన్స్పెక్టర్ రత్నాకర్ తదితరులు హాజరై పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ వేడుక‌ల్లో పాల్గొన్న పలువురు ప్రజా ప్రతినిధులు ముస్లింల‌కు రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ముస్లిం మైనార్టీలు, ప్రజా ప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మెట్ పల్లిలో రంజాన్. ఈ కార్యక్రమంలో తదితరులు,మైనారిటీ నాయకులు, షేక్, ముహమ్మద్ సోహెల్ పటేల్ తో పాటు పలువురు ముస్లింలు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. పట్టణంలో రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత మైనార్టీ పెద్దలు, మత గురువులు తదితరులు పాల్గొన్నారు. కాగా రంజాన్ పండుగను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మెట్ పల్లి డీఎస్పి రాములు ఆధ్వర్యంలో సీఐ అనిల్, ఎస్సై కిరణ్ ఎస్సై 2 రాజు నాయక్ సిసిఎస్ ఎస్సై రవీందర్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments