Friday, April 4, 2025
HomeUncategorizedఆర్.ఎస్. బ్రదర్స్ వారి 13వ షోరూమ్ అత్తాపూర్లో శుభారంభం

ఆర్.ఎస్. బ్రదర్స్ వారి 13వ షోరూమ్ అత్తాపూర్లో శుభారంభం

ఆర్.ఎస్. బ్రదర్స్ వారి 13వ షోరూమ్ అత్తాపూర్లో శుభారంభం

హైదరాబాద్ మార్చి 5( ప్రజాకలం ప్రతినిధి)
కుటుంబసమేతంగా షాపింగ్ చేయదగిన అత్యంత విశ్వసనీయ పేర్లలో ఒకటైన ఆర్.ఎస్. బ్రదర్స్ వారు, అత్తాపూర్లో తమ 13వ షోరూమ్ ను ప్రారంభిస్తున్నట్లు సగర్వంగా ప్రకటిస్తున్నారు. వర్తక, వాణిజ్యాలలో సుదూర దృష్టి కలిగిన శ్రీ పి. వెంకటేశ్వర్లు, శ్రీ ఎస్.రాజమౌళి, శ్రీ టి.ప్రసాదరావు మరియు దివంగత పి. సత్యనారాయణ గార్లు ఆర్.ఎస్. బ్రదర్స్ను స్థాపించి, సంప్రదాయాన్ని ఆధునిక ఫ్యాషన్తో మిళితం చేస్తూ సంవత్సరాలుగా పేరొంది నిలిచారు. హైదరాబాద్ వాసులందరికీ అసాధారణమైన షాపింగ్ అనుభవాన్ని అందించే ఈ బ్రాండ్ ప్రయాణంలో ఈ తాజా విస్తరణ మరో మైలురాయిని సూచిస్తుంది.
ప్రముఖ తెలుగు సినీనటి కుమారి నిధి అగర్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, ఆర్.ఎస్. బ్రదర్స్ వారి నాణ్యత మరియు వైవిధ్యాన్ని ప్రశంసించారు. ఆమె మాట్లాడుతూ, “ఆర్.ఎస్. బ్రదర్స్ ఎల్లప్పుడూ ఫ్యాషన్లో విశ్వసనీయత కలిగి, అత్యుత్తమ ధరలకు వైవిధ్యభరిత మైన వస్త్రాలను అందిస్తోంది. దానికి చాలా సంతోషిస్తున్నాను మరియు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా వివాహ వేడుకలు మరియు రంజాన్ కలెక్షన్లపై ఆకర్షణీయమైన ప్రారంభ ఆఫర్లను కోల్పోకండి!” అని వినియోగదారులను కోరారు
ఆర్.ఎస్. బ్రదర్స్ రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు శ్రీ పి. వెంకటేశ్వర్లు, శ్రీ ఎస్. రాజమౌళి, శ్రీ టి.ప్రసాదరావు గార్లు తమ బ్రాండ్ భవిష్యత్తు మార్గదర్శకత్వాన్ని, అభివృద్ధి పట్ల తమ నిబద్ధతను నొక్కి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ షాపింగ్ మాల్ గా, వారు తమ ఉనికి పట్ల ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు మరియు సంస్థ మరింత విస్తరణకు వారి ప్రణాళికలను వెల్లడించారు.
నూతనంగా ప్రారంభించిన అత్తాపూర్ షోరూమ్లో పురుషులు, మహిళలు మరియు పిల్లల దుస్తులలో 4 లక్షలకు పైగా విస్తృతమైన కలెక్షన్లను అందిస్తోంది మరియు ధరలు కేవలం రూ.150 నుండి ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ ఫ్యాషన్లను సరసమైన ధరలకు అందించే ఈ షోరూమ్లో కంచి పట్టుచీరలు, ఫ్యాన్సీ చీరలు, డ్రెస్ మెటీరియల్, వెస్ట్రన్ దుస్తులు, బ్రాండెడ్ పురుషుల దుస్తులు, ఎత్నిక్ / సాంప్రదాయ దుస్తులు మరియు పిల్లల దుస్తులు లభ్యమవుతాయి.
డైరెక్టర్ శ్రీ పి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, “శ్రేష్టమైన కంచి పట్టుచీరలతో గల అద్భుతమైన వివాహ కలెక్షన్లను ఉత్తమ ధరలకు అందిస్తున్నామని వివరించారు. రాబోయే వివాహ సీజన్ కోసం ప్రీమియం బ్రైడల్ వేర్, డిజైనర్ ఎసెంబుల్స్ మరియు సొగసైన ఎత్నిక్ వేరు అందించడంలో ఆర్. ఎస్. బ్రదర్స్ వారి నిబద్ధతను చాటిచెప్పారు.
భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించిన హై-ఫ్యాన్సీ చీరల కలెక్షన్లను, అలాగే అందరి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన పురుషుల దుస్తుల బ్రాండ్లను షోరూమ్ జాగ్రత్తగా రూపొందించిందని డైరెక్టర్ శ్రీ ఎస్. రాజమౌళి తెలిపారు. రంజాన్ సీజన్ కోసం పండుగ దుస్తులు, ఫ్యూజన్ ఫ్యాషన్ మరియు సాంప్రదాయ / ఎత్నిక్ దుస్తులలో కొత్త మోడళ్ళను కూడా ఆయన పరిచయం చేశారు.
మరో డైరెక్టర్ శ్రీ టి.ప్రసాదరావు, ప్రతి ఇంటిలో జరిగే వేడుకలకు ఆర్.ఎస్. బ్రదర్స్ ఇష్టమైన బ్రాండ్గా మార్చిన తమ కస్టమర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నాణ్యత, వైవిధ్యం మరియు విలువలను నిరంతరం అందించడం ద్వారా వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టడానికి తమ బృందం అంకితభావంతో ఉందని ఆయన హామీ ఇచ్చారు.
ఫ్యాషన్, సంప్రదాయం మరియు విభిన్న శైలితో కూడిన ప్రపంచానికి అత్తాపూర్ షోరూమ్లోకి అడుగుపెట్టండి. మీరు వివాహానికి సిద్ధమవుతున్నా, రంజాన్ జరుపుకుంటున్నా- ఉత్తేజకరమైన ఆఫర్లు, ప్రీమియం కలెక్షన్లు మరియు సాటిలేని ధరలతో మరపురాని షాపింగ్ అనుభవాన్ని ఆర్.ఎస్. బ్రదర్స్ వారు మీకు హామీ ఇస్తున్నారు. అత్తాపూర్ షోరూమ్ను సందర్శించి… అద్భుతమైన చీరలు, పండుగ మరియు డిజైనర్ దుస్తులను ఈ వివాహ మరియు రంజాన్ వేళ సరికొత్త కలెక్షన్లతో సాటిలేని ధరలకే సొంతం చేసుకోమని ఆర్.ఎస్. బ్రదర్స్ బృందం వారు ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments