కోట్ల విలువైన మట్టి కుప్పల సీజ్
*సురేష్ రెడ్డి చేసి ఆరోపణలపై స్పందించిన అధికారులు
*ఆరు మట్టి కుప్పలను గుర్తించి సీజ్ చేసిన ఏడీ శ్రీనివాస్
పెద్దపల్లి,మార్చి28:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లి ఊర చెరువులో జరిగిన అక్రమ మట్టి తరలింపు పై అధికారులు ఎట్టకేలకు స్పందించారు.ఈ వ్యవహారంలో మైనింగ్ ఏడి శ్రీనివాస్ కీలక వివరాలను వెల్లడించారు. 2022లో ఆరు ఇటుక బట్టీల యాజమాన్యాలకు పరిమితంగా మట్టి తవ్వకాలకు అనుమతులు ఇచ్చినప్పటికీ,వారు నిబంధనలను అతిక్రమించి అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు మైనింగ్ ఏడి శ్రీనివాస్ తెలిపారు.అక్రమంగా తవ్విన మట్టికి సంబంధించి సుమారు రూ.2 కోట్ల జరిమానా విధించినట్లు శ్రీనివాస్ వెల్లడించారు.2023లో జరిమానా చెల్లించాలని నోటీసులు జారీ చేసినప్పటికీ,ఇటుక బట్టీల యాజమానులు ఇంతవరకు స్పందించలేదని ఆయన పేర్కొన్నారు.అక్రమంగా నిల్వ చేసిన ఆరు మట్టి కుప్పలను గుర్తించి సీజ్ చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ మట్టి కుప్పల విలువ కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ స్పష్టం చేశారు.ఈ వ్యవహారంపై రెండు రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను తయారు చేస్తామని ఆయన వెల్లడించారు.ఈ అక్రమ మట్టి దందాపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో అధికారులు స్పందించడం గమనార్హం
కోట్ల విలువైన మట్టి కుప్పల సీజ్
Recent Comments
Hello world!
on