జిల్లా ఎస్పీని కలిసిన మెట్ పల్లి సీఐ అనిల్ కుమార్
మెట్ పల్లి ప్రతినిధి, మార్చి 27 (ప్రజాకలం) : మెట్ పల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల మెట్ పల్లి సీఐగా అనిల్ కుమార్ బదిలీపై వచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లా కేంద్రంలో ఎస్పీ అశోక్ కుమార్ ను కలిసి పూల మొక్కను అందజేశారు. సిఐగా బాధ్యతలు స్వీకరించడం పట్ల ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.