అంతర్జాతీయ సంభాషణ సదస్సుకు హాజరైన ఐ జే యు అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్:మార్చి20 (ప్రజాకలం) క్యూబా దేశంలోని హవానా విశ్వవిద్యాలయంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న నాల్గవ అంతర్జాతీయ సంభాషణ సదస్సుకు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డిని భారతదేశ ప్రతినిధిగా నిర్వాహకులు ఆహ్వానించారు. ప్రపంచంలోని ఆయా దేశాల ప్రతినిధులు హాజరైన ఈ సదస్సును క్యూబా అధ్యక్షుడు
మిగ్యుల్ డియాజ్ కానెల్ ప్రారంభించారు.
“తప్పుడు సమాచారం మరియు మీడియా
మార్పులను ఎదుర్కోవడం” అనే అంశంపై శ్రీనివాస్ రెడ్డి గారు పేపర్ ప్రెజెంటేషన్ చేసి సభికుల మన్ననలు పొందారు.