రైతు రుణమాఫీ ఎక్కడ చేశారో ముఖ్యమంత్రి తేల్చాలి
*ఎమ్మెల్యే సొంతవూరిలోనే సర్వే చేద్దాం
*వడగండ్ల బాధితులను సత్వరమే ఆదుకోవాలి
*ఎల్ఆర్ఎస్ గడువును మరో నెలరోజులు పొడగించాలి
-బీజేపీ మాజీ ఎమ్మెల్యే రామక్రిష్ణారెడ్డి
పెద్దపల్లి,మార్చి 27:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
రాష్ట్రంలో రైతులకు రూ.2లక్షల మేర రుణమాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు ప్రచారం చేస్తోందని భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి మండిపడ్డారు. గురువారం పెద్దపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుజ్జుల మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సొంత ఊరిలో సర్వే చేయడానికి తాము సిద్దమని,ఎంతమంది రైతులకు రూ.2లక్షల మేర రుణం మాఫీ అయ్యిందో తేలుతుందని స్పష్టం చేశారు.రూ.2లక్షల కంటే అధికంగా రుణాలు పొందిన రైతుల పరిస్తితి ఏంటని,సరైన విధానం అమలు చేయకపోవడం వల్ల రాష్ట్రంలోని రైతులు ఆగం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చి సత్వరమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.డి-83 ద్వారా చివరి ఆయకట్టు భూములకు నీరందించాలని కోరారు.ఎల్లంపల్లిలో నీరు లేకపోతే ఎస్సారెస్పి నుండి నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు.
రైతుసమస్యలపై ఉద్యమాలు
రాష్ట్రంలో అస్థవ్యస్థ పరిపాలన కోనసాగుతున్నదన్న గుజ్జుల,అసమర్థ నిర్ణయాల వల్ల రైతులు నిండా మునుగుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో భారీ రైతు ఉద్యమాలకు పిలుపునిచ్చినట్లు గుజ్జుల తెలిపారు.అదేవిధంగా ఇంటర్నెట్ సర్వర్ సమస్యలతో చెల్లింపులు జరపలేకపోతున్న వారికోసం ఎల్ఆర్ఎస్ చెల్లింపు గడువు తేదీని మరో నెలరోజులు పొడగించాలని గుజ్జుల డిమాండ్ చేశారు.
సెయింట్ ఆన్స్ పాఠశాల అనుమతులు రద్దు చేయాలి
-బీజేపీ జిల్లా అద్యక్షుడు కర్రె సంజీవరెడ్డి
హనుమాన్ మాలధారణ వేసిన విద్యార్థి పట్ల అనుచితంగా వ్యవహరించి,మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చేసిన సెయింట్ ఆన్స్ పాటశాల అనుమతులు రద్దు చేయాలని బీజేపీ జిల్లా అద్యక్షుడు కర్రె సంజీవరెడ్డి డిమాండ్ చేశారు.ఇదే విషయమై జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.ఈ సమావేశంలో బీజేపీ నాయకులు ఠాకూర్ రాంసింగ్,పల్లె సదానందం,వెల్లంపల్లి శ్రీనివాసరావు,పర్ష సమ్మయ్య, అమరగాని ప్రదీప్ కుమార్,కడారి అశోక్ రావు,జంగ చక్రధర్ రెడ్డి,బెజ్జంకి దిలీప్ కుమార్,శివంగారి సతీష్,శాతరాజు రమేష్,మంథెన్ క్రిష్ణ,ఎండి ఫహీం,శ్రీనివాస్ గౌడ్,
మౌటం నర్సింగం,స్వతంత్ర కుమార్,కొమిరిశెట్టి రమేష్,తదితరులు పాల్గొన్నారు.
రైతు రుణమాఫీ ఎక్కడ చేశారో ముఖ్యమంత్రి తేల్చాలి
Recent Comments
Hello world!
on