Friday, April 4, 2025
Homeతెలంగాణవినూత్నసంస్కరణతో కొత్త పుంతలుతొక్కుతున్న పౌర సరఫరాల శాఖా

వినూత్నసంస్కరణతో కొత్త పుంతలుతొక్కుతున్న పౌర సరఫరాల శాఖా

వినూత్నసంస్కరణతో కొత్త పుంతలుతొక్కుతున్న పౌర సరఫరాల శాఖా
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చౌక ధరల దుకాణాలు. డిజిటల్ మానటిరింగ్ తో రైతు సంక్షేమానికి చర్యలు. నాణ్యతా ప్రమాణాలలో కఠినమైన చర్యలు. ఫిలిప్పీన్స్ ప్రభుత్వంతో బియ్యం ఎగుమతి ఒప్పందం. పి.డి.ఎస్ బియ్యంపై గట్టి నిఘా. 409 కోట్ల విలువైన పి.డి.ఎస్ బియ్యం పట్టివేత . వరి కొనుగోలులో వినూత్న ప్రక్రియ #వాతావరణనుగుణంగా ధాన్యం కొనుగోలు. ధాన్యం కొనుగోలులో స్కాచ్ అవార్డ్ కైవసం చేసుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖా . రూట్ ఆప్టిమైజేషన్ 12 నుండి 15 కోట్ల ఆదా -ఐ. ఐ. యం రాయపూర్ లో జరిగిన అంతర్జాతీయ సెమినార్ లో డి.ఎస్.చవాన్రా ష్ట్ర పౌర సరఫరాల శాఖలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా ముఖ్య కార్యదర్శి డి.ఎస్.చౌహాన్ పేర్కొన్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వ చౌక ధరల దుకాణాలు అనుసంధానం చెయ్యడంతో అవకతవకలను కట్టడి చెయ్యగలిగామని ఆయన స్పష్టం చేశారు.
ఐ. ఐ. యం రాయపూర్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.
మారుతున్న పరిస్థితులకనుగుణంగా పౌర సరఫరాల శాఖలో తీసుకొచ్చిన మార్పులు ఇప్పుడు దేశానికే రోల్ మోడల్ గా మారాయన్నారు.
తద్వారా ఆహారభద్రత అంశంలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా మార్గం సులువుగా మారిందని ఆయన చెప్పారు
వినూత్న సంస్కరణలతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖా యావత్ భారత దేశంలోనే అగ్ర భాగంలో నిలిచిందన్నారు
ప్రధానంగా ధాన్యం కొనుగోలు సమయంలో మారుతున్న వాతావరణ పరిస్థితులకనుగుణంగా జరిపిన కొనుగోలుకు స్కాచ్ అవార్డ్ రావడం ఇందుకు నిదర్శనంగా మారిందన్నారు
అంతే గాకుండా డిజిటల్ మానటిరింగ్ తో రైతు సంక్షేమానికి తీసుకున్న చర్యలను సెమినార్ లో పాల్గొన్న పలు రాష్ట్రల ప్రతినిధులు ప్రశంసించారన్నారు
నాణ్యతా ప్రమాణాలు కఠినంగా పాటించడంతో అక్రమాలకు తావు లేకుండా పోయిందన్నారు.
సన్న బియ్యం పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వివిధ రాష్ట్రాల స్వాగతిస్తూనే ఆహార భద్రత విషయంలో తెలంగాణా ప్రభుత్వం పేదల పట్ల చూపుతున్న మక్కువకు అద్దం పడుతుందని పలువురు కొనియాడారని ఆయన చెప్పుకొచ్చారు
అంతే గాకుండా ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతికై రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం రాష్ట్ర పౌర సరఫరాల శాఖాలో ఒక మైలు రాయిగా నిలిచి పోతుందన్నారు
ప్రధానంగా దారి మల్లుతున్న పి.డి.ఎస్ బియ్యంపై పెట్టిన గట్టి నిఘాతో 409 కోట్ల రూపాయల విలువ చేసే బియ్యం పట్టుకున్నామన్నారు
అన్నింటికీ మించి రూట్ ఆప్టిమైజేషన్ తో రాష్ట్ర పౌర సరఫరాల శాఖా 12 నుండి 15 కోట్ల రూపాయలను ఆదా చేసిందన్నారు.
వీటన్నింటికి ప్రధాన కారణం రాష్ట్ర పౌర సరఫరాల శాఖలో తీసుకొచ్చిన మార్పులేనని చౌహన్ పునరుద్ఘాటించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments