తెలుగుదేశం ఆవిర్భావంతోనే సంక్షేమానికి నాంది
-పెద్దపల్లి మాజీ టీడీపీ జిల్లా అద్యక్షుడు అక్కపాక తిరుపతి
*ఘనంగా 43వ టిడిపి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
పెద్దపల్లి,మార్చి29:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
సమాజమే దేవాలయం,ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో అన్న నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీది ఘనమైన చరిత్ర అని టీడీపీ మాజీ జిల్లా అద్యక్షుడు అక్కపాక తిరుపతి అన్నారు.టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్పస్వామి దేవాలయం వద్దగల ఎన్టీఆర్ విగ్రహానికి తిరుపతి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం టీడీపీ కార్యాలయం వద్డ తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా మాజీ జిల్లా అద్యక్షుడు అక్కపాక తిరుపతి పలువురు పార్టీ నాయకులతో కలిసి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం పార్టీ జెండా ఎగురవేసి,కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా అక్కపాక తిరుపతి మాట్లాడుతూ దేశ రాజకీయ రంగంలోకి తారాజువ్వలా దూసుకువచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే తెలుగు బావుటాను ఎగురవేసిన యుగపురుషుడు నందమూరి తారక రామారావు అని,పేదల జీవితాలకు పెన్నిధిగా,అన్నదాతలకు ఆశాదీపంగా, ఆడపడుచులకు అన్నగా,బడుగుల సంక్షేమానికి వినూత్న పథకాలెన్నో తెచ్చిందన్నారు.తెలుగుజాతికి మార్గదర్శం చేసి,రాష్ట్ర ప్రగతి, ప్రజారంజక పాలన చేసిన మహానాయకుడు ఎన్టీఆర్, నీతివంతమైన రాజకీయాలతో దేశంలోనే ప్రాంతీయ పార్టీ లకు సముచిత గౌరవాన్ని,భాగస్వామ్యాన్ని కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశ మన్నారు.ప్రజల ఆకాంక్షల మేరకు పార్టీ ప్రణాళికను రూపొందించి,43దశాబ్దాలుగా పేదరికం నిర్మూలన, బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని అన్నారు.కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల నియంత పాలనకు అంతం పలికేందుకు ప్రజలు తెలుగుదేశానికి మద్దత్తు తెలుపాలని కోరారు.అనంతరం టీడీపీ సీనియర్ నాయకుడు కోల కిషన్ రావు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామరావు సమాజమే దేవాలయం,ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీని స్థాపించి పేదలకు కూడు,గూడు,గుడ్డ అందించడమే ధ్యేయంగా పాలన సాగించారని కొనియాడారు.రూ.2లకే కిలో బియ్యం ఇచ్చి పేదలకు కడుపునిండా అన్నం పెట్టారని ప్రశంసించారు.ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి దేశంలోని ఇతర రాష్ట్రాలవారు కూడా అమలు పరచారన్నారు.తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోప్పుల మురళి,మధుకర్,అక్కపాక చంద్రయ్య,పెరుక శ్రీనివాస్,బొంకూరు సతీష్,పెరుక సుదాకర్,ఈర్ల శంకర్,మాచర్ల రాజు,కుక్క శంకర్,విక్రమ్ తోపాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగుదేశం ఆవిర్భావంతోనే సంక్షేమానికి నాంది
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on