పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
— మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి.
కాల్వశ్రీరాంపూర్,మార్చి23:(ప్రజాకలం ప్రతినిధి)వడగండ్ల వర్షంతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలని మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి అన్నారు.కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని అంకంపల్లి గ్రామంలో అకాల వర్షంతో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను ఆదివారం ఆయన గ్రామ రైతులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన మొక్కజొన్న పంటలు చేతికందె సమయంలో ప్రకృతి వైపరిత్యంతో అపార నష్టం జరిగిందని,ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు లను ఆదుకోవాలన్నారు.గ్రామంలో సుమారు 30 ఎకరాల వరకు మొక్కజొన్న పంటకు నష్టం జరిగి ఉంటుందన్నారు.అలాగే ప్రభుత్వం గుర్తించి ఇచ్చిన బయో సీడ్స్ మొక్కజొన్న పంట ఏపుగా పెరగడంతో ఆశించిన దిగుబడి ఇచ్చే అవకాశం లేదన్నారు.దీని ద్వారా రైతులు నష్టపోయే అవకాశం ఉందన్నారు.నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ.40వేల పరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేకుంటే రైతుల పక్షాన ఉద్య మిస్తామన్నారు.ఆయన వెంట రైతులు కాసార్ల తిరుపతి,కంచన దేవక్క,కంచన కుమార్,కూన కుమార్,తోట కుమార్,మారుపాక ప్రసన్న,కుమార్,చిటికెలా రవి,కొండ్రా విక్రమ్ తదితరులు ఉన్నారు.
పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
Recent Comments
Hello world!
on