పసుపు రైతు మద్దతు ధరను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా
మార్కెట్ యార్డర్ సందర్శించిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.
మెట్ పల్లి: ప్రతినిధి మార్చి06 (ప్రజా కలం మహమ్మద్ అజీమ్) పసుపు రైతుల మద్దతు ధర సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ తెలిపారు.గురువారం మెట్ పెల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఆరబోసిన పసుపు ధాన్యాన్ని పరిశీలించారు. పసుపులో పలు రకాల ధాన్యం గురించి వ్యవసాయ అధికారులకు అడిగి తెలుసుకున్నారు.పసుపు ధాన్యం కొనుగోలు ఎలా చేస్తున్నారని, ఎక్కడి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో నేరుగా మాట్లాడారు ఎన్ని ఎకరాలలో పంట వేశారని, ఎంత పంట వచ్చిదని, పసుపు క్వింటాల్ కు మద్దతు ధర ఎలా వుందని, లాభ, నష్టాలకు సంబంధించిన అంశాలపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఏ రకంగా పసుపు కొనుగోలు చేస్తున్నారనేది యాక్షన్ ప్లాన్ వేలం ద్వారా స్వయంగా కలెక్టర్ ప్రత్యక్షంగా చూశారు. లైసెన్స్ దళారులు కమీషన్ ఏజెంట్ ఏ రకంగా పసుపు కొనుగోలు చేస్తున్నారనేది తెలుసుకున్నారు.దళారుల నుండి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని రైతులను స్వయంగా అడిగి వివరాలు తెలుసుకున్నారు.పసుపులో 3 రకాలు ఉంటాయని అందులో ఒకటి కాడి, రెండవది గోల, మూడవది చూర, అని అధికారులు కలెక్టర్ తెలిపారు.ఇందులో మొదటిది కాడి మంచి రకం పసుపు క్వింటాలుకు మద్దతు ధర 8-10 వేలు, రెండవది గోల మంచి రకం పసుపు క్వింటాల్ కు 7-8 వేలు,మూడవది చూర మంచి రకం పసుపుకు 6-7 వేలు మద్దతు ధర ఉందని అధికారులు కలెక్టర్ తెలిపారు.అలాగే పసుపు కొనుగోలు చేసిన తర్వాత ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారని ఆరా తీయగా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతుందని అధికారులు కలెక్టర్ తెలిపారు.ప్రస్తుతం రైతులు మంచి పసుపు తీసుకువస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఉడకని పసుపు ఉండటం వల్ల ధర తక్కువగా పలుకుతుందని, కారణం రైతులకు సరియైన పరికరాలు లేక పోవడం వల్ల ధర కూడా తక్కువగా వస్తుంది అని అధికారులు కలెక్టర్ తెలిపారు.అనంతరం మార్కెట్ యార్డ్ ఆఫీసు లో పసుపు అమ్మకాలు ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాలని ఎలా చేస్తున్నారు స్వయంగా పరిశీలించారు.అనంతరం మెట్ పెల్లి మున్సిపల్ కార్యాలయాన్ని అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులను పరిశీలించారు. ఎల్ ఆర్ఎస్ దరఖాస్తులు ప్రాసెస్ చేయబడ్డవి ఎన్ని ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు వాటిపైన కలెక్టర్ సమీక్షించారు. అలాగే పట్టణంలో ఇంటి పన్ను 100 శాతం వసూలు చేయాలని తెలిపారు. అంతకుముందు టౌన్ ప్లానింగ్ ఆఫీస్ ని సందర్శించిఎల్ ఆర్ఎస్ లాగిన్ స్వయంగా చేక్ చేస్తారు.కలెక్టర్ వెంట, జిల్లా మార్కెటింగ్ అధికారి, మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.