హైదరాబాద్‌లో PMJ జ్యువెల్స్ ఆధ్వర్యంలో అతిపెద్ద వెడ్డింగ్, హాఫ్ సారీ ఆభరణాల ప్రదర్శన…
-మార్చి 7 నుండి మార్చి 9 వరకు జరిగే 3 రోజుల పాటు జరగనున్న ప్రదర్శన…
-ఇంతకు ముందు చూడని 10 వేలకు పైగా హస్తకళా డిజైనర్ ఆభరణాల ప్రదర్శన…
హైదరాబాద్ మార్చి 7, (ప్రజా కలం ప్రతినిధి): దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రియమైన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ అయినటువంటి PMJ జ్యువెల్స్ ఆధ్వర్యంలో శుక్రవారం బంజారా హిల్స్‌లోని తాజ్ కృష్ణలో హైదరాబాద్‌లో అతిపెద్ద వెడ్డింగ్, హాఫ్ సారీ ఆభరణాల ప్రదర్శనను ప్రారంభించింది. ఈ సందర్భంగా PMJ జ్యువెల్స్ ఆధ్వర్యంలో ప్రతీక్ జైన్, జూబ్లీహిల్స్‌లోని PMJ జ్యువెల్స్ ఫ్లాగ్‌షిప్ స్టోర్ హెడ్, చక్రపాణి, స్టోర్ మేనేజర్, హిమాయత్‌నగర్, పాండు గౌడ్, స్టోర్ మేనేజర్ చందానగర్ మరియు తదితర ప్రఖ్యాత వ్యక్తులు, ఆభరణాల ప్రియులు పాల్గొన్నారు. అంతేకాకుండా నగరంలోని ప్రఖ్యాత సామాజికవేత్తలు ఈ ప్రదర్శనకు హాజరయ్యారు.
మార్చి 7న ప్రారంభమైన ఈ రోజుల ప్రదర్శన మార్చి 9 వరకు కొనసాగుతుంది. ఆభరణాల ప్రదర్శనలో 20000+ పైగా PMJ యొక్క అత్యుత్తమ హ్యండ్ మేడ్ డిజైనర్ ఆభరణాల శ్రేణిని ప్రదర్శిస్తుంది. ఈ ప్రదర్శన హైదరాబాద్‌లో ఇప్పటివరకు అతిపెద్ద వివాహ, హాఫ్ సారీ ఆభరణాల ప్రదర్శనగా నిలుస్తోంది. వివాహ ఆభరణాలు, హాఫ్ సారీ ఆభరణాలతో పాటు.., ఈ ప్రదర్శనలో రోజువారీ దుస్తులు, ఫెస్టివల్ క్రియేషన్‌లు కూడా ప్రదర్శించబడతాయి, ఇవి ఈ సీజన్‌కు మాత్రమే కాకుండా ఆఫీసు, పార్టీలతో పాటు సాధారణ దుస్తుల్లో కూడా ఉపయోగించబడతాయి.
ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా క్యూరేట్ చేయబడిన మరియు విలక్షణమైన బ్యూటీ డిజైన్‌లు ప్రదర్శించబడతాయి, ఇవి కాలాతీత సంప్రదాయాన్ని సమతుల్యం చేయడంతో పాటు తాజా, ఫ్యాషన్ డిజైన్‌లను ప్రతిబింభిస్తున్నాయి. వజ్రాలు, బంగారం, పోల్కీ, సాలిటైర్‌లలో విస్తృత శ్రేణి డిజైన్‌లతో.., ఈ ప్రదర్శనలో సాంప్రదాయ డిజైన్‌లు మొదలు ఆధునిక హంగుల వరకు సమకాలీన సౌందర్యంతో అలరిస్తున్నాయి.
ప్రదర్శన ప్రారంభోత్సవం సందర్భంగా PMJ జ్యువెల్స్ _____ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ…, “తాజ్ కృష్ణలోని మా ప్రదర్శనలో ఇంత ప్రత్యేకమైన ఆభరణాల ప్రదర్శనను నిర్వహించడం మాకు సంతోషంగా ఉంది. వధువులు, తోడి పెళ్లికూతుళ్లు, హాఫ్ సారీ వేడుకలను జరుపుకునే యువతులు, బంధువులు.. ఇతర ఆభరణాల ప్రియులు ఈ ప్రదర్శనను సందర్శించాలి. PMJ జ్యువెల్స్ యొక్క ప్రతి ఆభరణాం భారతదేశంలో రూపొందించబడింది., సంప్రదాయం మరియు ఆధునికత యొక్క సమన్వయంతో అత్యంత ప్రేమ, అభిరుచితో మేము ప్రదర్శించే డిజైన్‌లు భారతీయ స్వర్ణకారుల అద్భుతమైన హస్తకళ నైపుణ్యాలను ప్రతిబింబిస్తాయి. సెలబ్రేషన్స్ సీజన్ అనేది ఆభరణాల ప్రియులు తమ ప్రత్యేక సందర్భాలలో అత్యుత్తమ ఆభరణాలను కొనుగోలు చేయడంలో సరైన ఎంపికలు చేసుకోవడానికి అనువైన సమయం. ఇక్కడ ప్రదర్శించబడే డిజైన్లు అత్యుత్తమ నాణ్యతతో ఉంటాయి. ఈ ప్రదర్శనలో ప్రతి సందర్శకుడు మా తాజా అద్భుతమైన డిజైన్లన విలాసవంతమైన వైభవాన్ని ఆస్వాదిస్తారని’’ తెలిపారు.
PMJ వ్యాపారంలో కొత్త ప్రమాణాలను సృష్టించడంలో, ప్రజలను ప్రేరేపించడంలో, హస్త కళను ప్రోత్సహించడంలో పరిశ్రమలో ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదర్శన ఆభరణాల ప్రియులను గతంలో ఎప్పుడూ చూడని, అద్బుత సృష్టిని వీక్షించడానికి మరియు కొనుగోలు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది.
హైదరాబాద్‌లో PMJ జ్యువెల్స్ ఆధ్వర్యంలో అతిపెద్ద వెడ్డింగ్, హాఫ్ సారీ ఆభరణాల ప్రదర్శన…
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on