అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు
సీసీ కెమెరాలు ప్రారంభించిన
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం,మార్చి 23, (ప్రజా కలం)
మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ నవయుగ కాలనీలో సీసీ కెమెరాలను మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణ కోసం చేపట్టిన గొప్ప కార్యక్రమం అని కమ్యూనిటీలో విశ్వాసాన్ని పెంచుతాయి. సీసీ కెమెరాలు దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కాలనీలు అభివృద్ధి కొరకై ప్రభుత్వాన్ని ఎదిరించి అయినా సరే నిధులు తీసుకొస్తా అని నా మద్దతు కొనసాగుతుందని ఆమె హామీ ఇచ్చారు. ఈ విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజల భద్రతను మరింత మెరుగుపరిచే ప్రయత్నాలు బాగుందన్నారు
కొనియాడారు.ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, స్వర్ణ గంటి అర్జున్, పెద్దబావి ఆనంద్ రెడ్డి, లిక్కి కృష్ణారెడ్డి, సమ్ రెడ్డి వెంకట్ రెడ్డి, భీమిడి జంగారెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు
Recent Comments
Hello world!
on