వెయ్యేళ్ల చరిత్రలయమే.. వెండికొండ…!
అద్భుత కళాఖండాలతో ఆలయ నిర్మాణం….!
ఎటు చూసినా ఆహ్లాదకర వాతావరణం…!
కొలిచిన వారికి కొంగు బంగారం…!
వారం రోజుల పాటు పార్వతీ పరమేశ్వరుల కనివిని ఎరుగని బ్రహ్మోత్సవాలు…!
5 వ తేదీ నుంచి 12 వరకు ఉత్సవాలు…!
వికారాబాద్ జిల్లా (ప్రజాకలం ప్రతినిధి:)
ఆది దంపతులకు నిలయమైన అందమైన ప్రకృతి నడుమ ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతూ ..అద్భుతమైన కట్టడాలతో అలనాటి కాకతీయ కళా వైభవానికి ప్రతిరూపంగా నిలుస్తూ… చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా ఎన్నో జ్ఞాపకాలకు మధుర ఘట్టాలను తనలో దాచుకున్న గొప్ప పుణ్యక్షేత్రం ఎల్లకొండ శ్రీ పార్వతీ పరమేశ్వరుల దేవాలయం…
కొలిచిన వారికి కొంగు బంగారం…
ఎల్లకొండ గుట్టపై వెలసిన పార్వతీపరమేశ్వరులు కొల్చిన వారి కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలుస్తోంది. నిత్యం వందల సంఖ్యలో భక్తులు పార్వతీ పరమేశ్వరులను దర్శించుకొని తమ ముడుపులు, మొక్కలను చెల్లించుకున్నారు. పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్న వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయని ఇక్కడి ప్రజల నమ్మకం. పార్వతీ పరమేశ్వరుల ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపిస్తూ భక్తులకు, విహార యాత్రికులకు మానసిక ప్రశాంతతతో పాటు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది.
వెయ్యేళ్ల చరిత్ర…
ఈ ప్రాంతంలో జైనులు బౌద్ధులు ఎక్కువ నివసించేవారని తెలుస్తున్నది. గుట్టపై కనిపించే జైన విగ్రహాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 12వ శతాబ్దంలో పొట్ల చెరువు ప్రస్తుతం పటాన్ చెరువు పరిపాలించే రాజు జైన మతాన్ని అవలంబించే వాడు తన భార్య వీరశైవ వీరిద్దరి మధ్య చెలరేగిన కలహాలు విపరీతాలకు దారి తీశాయనీ చరిత్రకారులు చెబుతున్నారు. ఇరువర్గాలకు చెందిన పండితులకు మధ్య పాండిత్య పోటీలు నిర్వహించి, ఓడిన వర్గం రాజ్యాన్ని వదిలి వెళ్లాలని షరతులు పెట్టుకున్నారట ఈ దంపతులు.ఈ పోటీల్లో వీరశైవులు విజయం సాధించడంతో ఒప్పందం ప్రకారం అక్కడ నుంచి వెళ్ళిపోయారు. జైనుల స్థావరాలఅన్నింటినీ వీరశైవులు చేజిక్కించుకున్నారు.అంతేకాదు వారికి సంబంధించిన విగ్రహాలను నిర్మాణాలను ధ్వంసం చేశారని ప్రచారం కూడా ఉంది. గుట్టపై ధ్వంసమైన కనిపించే జైన విగ్రహాలు ఊరి మధ్యలో శిథిలావస్థకు చేరిన శంభు లింగేశ్వరాలయం దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా చెబుతారు గ్రామస్థులు. ఆ సమయంలో ఇక్కడికి వచ్చిన సుగ్గలదేవి శైవ మత అభివృద్ధికి నాంది పలికినట్లు వారు చెప్పారు.
కాకతీయుల కళాభవం….
కాకతీయులు మొదట జైనులు అనంతరం వారు శైవులుగా మారారు. ఊరి మధ్యలో ఉన్న పురాతన శంభు లింగేశ్వర ఆలయం కాకతీయుల కళా వైభవానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది. ఆలయం నిర్మాణ శైలి అచ్చం ఓరుగల్లులోని రామప్ప దేవాలయాన్ని తలపించడం సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అద్భుత మందిరం శిథిలావస్థకు చేరిపోవడం బాధాకరం. ఆలయం బయట అద్భుతంగా చెక్కబడిన నాగ దేవత శిల్పాలు పడి ఉన్నాయి. స్తంభాలు చెక్కిన తీరు వాటిపై అద్భుతమైన నెలకొల్పిన శైలి కాకతీయులు ఈ దేవాలయ నిర్మాణం పై తీసుకున్న శ్రద్ధను ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నది..
కొండే హద్దు…
ఎలా అంటే హద్దు. కొండ అంటే గుట్ట. గుట్టనే హద్దుగా కలిసిన ఊరు కాబట్టి… దీనికి ఎల్లకొండ అనే పేరు వచ్చినట్లు స్థానికులు చెప్పారు. పార్వతీపరమేశ్వరులు కొలువై ఉండే కైలాసాన్ని వెండికొండగా ఆదిదంపతులు వెలిసినందునే ఈ ఊరిని వెండికొండగా కూడా పిలిచినట్టు తెలుస్తున్నది
శ్రీశైలం దాకా సొరంగం…!
గుట్టపై అమ్మవారి ఆలయం పక్కనే ఒక సొరంగం ఉంది. రెండు ద్వారాలు కలిసిన ఈ సొరంగం గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇది సంగారెడ్డి జిల్లా మాందపురం పార్వతి పరమేశ్వర గుట్ట వరకు ఉందని, శ్రీశైలం వరకు మరోదారి ఉన్నదని పెద్దలు చెప్పేవారట. అయితే మనిషి పాకుతూ వెళ్ళ గలిగే అంత సందు మాత్రమే ఉన్న సొరంగంలోకి 4 అడుగుల దూరానికి మించి ఎవ్వరు ముందు కెళ్లేసహాసం చేయలేదట. అయితే ఆత్మ రక్షణ కోసం అప్పటి పాలకులు ఆ సొరంగాన్ని తవ్వించి ఉంటారని చరిత్రకారులు చెబుతున్నారు.
ఈ ఆలయం ఎక్కడ ఉంది… ఎలా వెళ్లాలి….?
వికారాబాద్ నుండి సుమారు 25 కిలోమీటర్లు, శంకర్ పల్లి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ గ్రామానికి హైదరాబాద్ నుంచి రైలు మార్గం లేదా రోడ్డు మార్గం ద్వారా శంకర్ పల్లి, వికారాబాద్ చేరుకుని అక్కడనుంచే బస్సుల్లోనూ, ఆటోల్లోనూ వెళ్లవచ్చు. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండల కేంద్రం నుంచి ఎల్లకొండ గ్రామానికి రవాణా సౌకర్యం ఉంటుంది. శంకర్ పల్లి రైల్వే స్టేషన్ లో దిగి పదిహేను కిలోమీటర్లు ఆటో లేదా బస్సు ద్వారా చేరుకోవచ్చు. ఒక్కపటి రంగారెడ్డి జిల్లా, నేటి వికారాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామం ఎల్లకొండ. మారుమూల గ్రామం అంటే చిన్న పల్లెటూరు ఏం కాదు. ఒకప్పుడు చుట్టుపక్కల నాలుగైదు గ్రామాలను తన హద్దుల్లోనే కలిపేసుకున్న మేజర్ గ్రామ పంచాయతీ ఎల్లకొండ. ఎన్నో రాజ వంశాల ఏలుబడిలో సిరి సంపదలతో తులతూగింది.
ఉత్సవాల వివరాలు…
26 న ఉదయం 8 గంటల నుంచి స్వామివారి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, ధ్వజారోహణం, అఖండ దీపారాధన రాత్రికి జాగరణ, భజనలు చేస్తారు. 5న రుద్రాభిషేకం, బిల్వార్చన, అమ్మవారికి పుష్పార్చన రాత్రి 9 గంటలకు నందివాహన సేవ. 6న అభిషేకం, శివ సహస్ర నామార్చన, అమ్మవారికి కుంకుమార్చన,రాత్రికి శేషవాహన సేవ. 7న అష్టమి స్వామివారికి, అమ్మవారికి నిత్యార్చనలు,8న నాలుగు గంటలకు పల్లకి సేవ 6 గంటలకు అగ్నిగుండం మహోత్సవం 8న ఉదయం ఎనిమిది గంటలకు రుద్రాభిషేకం,అమ్మవారికి విశేషార్చనలు, 11:00 నుంచి శ్రీ పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవం. 9న ఉదయం 8 గంటల నుంచి అభిషేకాలు, అర్చనలు సాయంత్రం 6 గంటలకు కలశరోహణం, గుమటం ఎక్కించుట.10న తెల్లవారుజామున 4 గంటలకు రథోత్సవం, ఉదయం 8 గంటల నుంచి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, అమ్మవారికి లలిత సహస్ర నామార్చన.11న నిండు జాతర 12న నాగవల్లి (నాగవల్లి) కార్యక్రమాలు జరుగుతాయని దేవాలయ అర్చకులు తెలిపారు.
అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం…
ఆలయ ధర్మకర్తల మండలి పట్లోళ్ల భరత్ రెడ్డి….
ఉత్సవాలకు కొన్ని వేల మంది భక్తులు తరలి వస్తారని ఎల్లకొండ శ్రీ పార్వతీ పరమేశ్వరుల ఆలయ ధర్మకర్తల మండలి పట్లోళ్ల భరత్ రెడ్డి అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వారం రోజుల పాటు నిత్యం వేలమంది భక్తులు వస్తారని చెప్పారు. కరోనా మహమ్మారి దృశ్య భక్తులు తగు జాగ్రత్తలు పాటించాలని వారన్నారు.
ప్రధాన అర్చకులు- మడుపతి నాగేశ్వరయ్య l
స్వామి….
జైనులు బౌద్ధులు కాలంనాటి ఎన్నో ఆధారాలు మా ఊరిలో కనిపిస్తున్నాయి. ఇక్కడ తవ్వకాలు జరిపిన శివలింగాలు,శిల్పకళాలు బయటపడుతున్నాయి. మరింత లోతైన వయక్తమవుతున్నాయి .పరిశోధన జరిపేందుకు పురావస్తుశాఖ అధికారులు చొరవ చూపాలి. ఈ పుణ్యక్షేత్రం కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలుస్తుంది.
గొప్ప చరిత్ర గల పుణ్యక్షేత్రం…
రావుగారి వెంకట్ రెడ్డి…గుడ్డి మల్కాపూర్ మార్కెట్ కమిటీ సభ్యులు..ఎల్లకొండ గ్రామం
మా గ్రామంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల ఆలయం గొప్ప పుణ్యక్షేత్రంగా చెప్పుకోవచ్చు. మా గ్రామంలో హద్దుగా ఉన్న గుట్టపై వెలసిన శివాలయానికి వెయ్యేళ్లకి పైగా చరిత్ర ఉంది.ఇక్కడ బయల్పడిన గృహాలు విగ్రహాల గురించి అధ్యయనం చేస్తే ఊరి చరిత్ర మరింత తెలిసే అవకాశం ఉంది.
కొలిచిన వారికి కొంగు బంగారం…
సుమలత మాణిక్య రెడ్డి…మాజీ ఎంపీటీసీ..
ఎల్లకొండ పార్వతీ పరమేశ్వర ఆలయం కొలిచిన వారి కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలుస్తోంది. పార్వతీ పరమేశ్వరులను దర్శించి కొని తమ ముడుపులు,మొక్కులు చెల్లించుకుంటారు. ఎటు చూసినా పచ్చని చెట్లు పంటపొలాలు ఆహ్లాదకరమైన వాతావరణం ఎత్తైన గుట్టపై పార్వతీపరమేశ్వరులు వెయ్యేళ్ళ క్రితం కొలువుదీరారు అని గ్రామస్తులు చెబుతుంటారు.
వెయ్యేళ్ల చరిత్రలయమే.. వెండికొండ…!
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on