మోసపోతున్న వినియోగదారులు, పెరుగుతున్న కేసులు
అవగాహన లేమితోనే సమస్యలు
సిటీ బ్యూరో: మార్చ్ 16 ప్రజాకలం ప్రతినిధి
అవగాహనతోనే వినియోగ దారుల హక్కులను పొందవచ్చని ఆసరా వ్యవస్థాపకులు హబీబ్ సుల్తాన్ అలీ వెల్లడించారు.
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్బంగా అవగాహ కార్యక్రమాన్ని ఏర్పాటు వినియోగదారులను మేలుకోపుతున్నట్లు స్పష్టం చేశారు.ప్రతి ఏటా వినియోగదా రులు మోసపోతున్నారని వారి సంఖ్య పెరుగుతోందని తెలిపారు.
రియల్ ఎస్టేట్,ఆన్లైన్ సర్వీస్ లు పేరుతో కోట్ల రూపాయలు వినియోగ దారులు నష్ట పోతున్నారని పేర్కన్నారు. గడిచిన పదేళ్లలో 2500 పై చిలుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టామని,500 కేసు లు పరిష్కారం చేసినట్లు వెల్లడిచారు.
1986లో వినియోగదారుల హక్కుల చట్టం అమల్లోకి వచ్చినా వినియోగదారుల్లో అవగాహన కల్పించడం లేదన్నారు.ఈ ఏడాది లో 60కేసులు నమోడైనట్లు వివరించారు. మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువు,డబ్బు చెల్లించి పొందే సేవలకు న్యాయం జరగాల్సిందే అని స్పష్టం చేశారు. మరో వైపు వినియోగదారుల్లో వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆసరా సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆసరా వ్యవస్థాపకులు హబీబ్ సుల్తాన్ అలీ, ఆసరా ప్రెసిడెంట్ వెంకట్ గుప్త, హరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మోసపోతున్న వినియోగదారులు, పెరుగుతున్న కేసులు
Recent Comments
Hello world!
on