ఘనంగా యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఉగాది వేడుకలు
-శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం
పెద్దపల్లి,మార్చి 31:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
యాదవ చారిటబుల్ ట్రస్ట్,అఖిలభారత యాదవ మహాసభ సంయుక్తంగా నిర్వహించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు,ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం మండలంలోని రంగాపూర్ గ్రామం రాధాకృష్ణ గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు.యాదవ చారిటబుల్ ట్రస్ట్ జిల్లా అద్యక్షులు మారం తిరుపతి యాదవ్, అఖిల భారత యాదవ మహా సభ జిల్లా అద్యక్షులు మేకల మల్లేశం యాదవ్ ఆద్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా యాదవ మహాసభ రాష్ట్ర అద్యక్షులు చింతల రవీంద్రనాథ్ యాదవ్,జిల్లా ఇంచార్జ్ జి.కె.శేఖర్ యాదవ్, గొర్లకాపరుల సంఘం అద్యక్షులు పోచబోయిన శ్రీహరి యాదవ్, మహేంద్రనాథ్ యాదవ్,రాష్ట్ర మండలి సభ్యుడు శిలారపు పర్వతాలు యాదవ్,గంట రాములు యాదవ్ హాజరయ్యారు.ఆదివారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకల్లో కవులు,కళాకారులచే కవి సమ్మేళనం, అర్.ఆర్ రమేష్ వేణుగానం,పిల్లల నృత్య ప్రదర్శనలు అలరించాయి.యాదవ చారిటబుల్ ట్రస్ట్ జిల్లా అద్యక్షులు మారం తిరుపతి యాదవ్,అఖిల భారత యాదవ మహా సభ జిల్లా అద్యక్షులు మేకల మల్లేశం యాదవ్ వారి సతీ మణులతో పురోహితులు శ్రీ కొండపాక శ్రీనివాసచార్యులు ఉగాది పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రవచనాలు,పంచాంగ శ్రవణం,జాతక ఫలాల విశ్లేషణ చేశారు.అనంతరం ఉగాది పచ్చడి,బక్షాలు,పులిహోర ప్రసాదాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన యాదవులకు యాదవ చారిటబుల్ ట్రస్ట్ వారు ఉగాది పురస్కారాలను అందజేసి సత్కరించారు. ముఖ్యఅతిదులను శాలువాలతో సత్కరించి మెమోంటోలను అందజేశారు.
పేద యాదవ విద్యార్థినికి ఎన్ఆర్ఐ కొలుముల దామోదర్ ఆర్థిక చేయూత
పేద యాదవ విద్యార్థులకు చేయూత నందించేందుకు కెనడాకు చెందిన ఎన్ఆర్ఐ కొలుముల దామోదర్ యాదవ్ తన ఫౌండేషన్ ద్వారా చేస్తున్న కృషిని పలువురు యాదవ నాయకులు కొనియాడారు. ఇందులో భాగంగా విద్య,క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న తమ్మడవేణ స్వప్నకు,ఎన్ఆర్ఐ కొలుముల దామోదర్ యాదవ్ అందజేసిన రూ.25 వేల నగదును యాదవ చారిటబుల్ ట్రస్ట్ నాయకులు స్వప్నకు అందజేశారు.ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ తన విద్యకు ఆర్థికంగా సహకరించిన కొలుముల దామోదర్ యాదవ్ కు అలాగే తనకు సహాయ సహకారాలు అందించిన కులపెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
యాదవ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం
-యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీంద్రనాథ్ యాదవ్
యాదవ చారిటబుల్ ట్రస్ట్ అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోందని,ముఖ్యంగా నిరుపేద యాదవులకు సహాయం చేయడం,విద్యను ప్రోత్సహించడం,వైద్య సహాయం అందించడం,వృద్దుల సంరక్షణ వంటి పలు సేవా కార్యక్రమాలను ఈ ట్రస్ట్ చేపడుతోందని వారి సేవలను కొనియాడారు.ఉగాది వేడుకలను నిర్వహించిన నిర్వహకులను అభినందించారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.
“ఓట్లు మనవే…సీట్లు మనవే”
*జిల్లా ఇంచార్జ్ జి.కె.శేఖర్ యాదవ్
యాదవులకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించాలని జిల్లా ఇంచార్జ్ జి.కె.శేఖర్ యాదవ్ కోరారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.”ఓట్లు మనవే ..సీట్లు మనవే” అనే నినాదంతో యాదవులు ఐక్యంగా ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు.యాదవులకు రాజకీయంగా అవకాశాలు కల్పించడం ద్వారా వారి సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని వారు తెలిపారు.నూతన తెలుగు సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.
నిరుపేద యాదవులకు అండగా యాదవ చారిటబుల్ ట్రస్ట్
-మారం తిరుపతి యాదవ్
యాదవ చారిటబుల్ ట్రస్ట్ నిరుపేద యాదవులకు సహాయం చేయడానికి కట్టుబడి ఉందని ట్రస్ట్ అద్యక్షులు మారం తిరుపతి యాదవ్ చెప్పారు.ట్రస్ట్ భవిష్యత్తులో విద్యా,వైద్య రంగాలలో,వృద్దుల సంరక్షణ తోపాటు మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.ఉగాది వేడుకలను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.అనంతరం ఉగాది విందు భోజనంతో కార్యక్రమం ముగిసింది.ఈ కార్యక్రమంలో యాదవ మహాసభ నాయకులు,యాదవ చారిటబుల్ ట్రష్టు నాయకులు,కుల పెద్దలు,యాదవ సోదరులు,మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఘనంగా యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఉగాది వేడుకలు
Recent Comments
Hello world!
on