గూడు కూలగొట్టి గోసపెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి
*పేదోడిపై అంత అత్యుత్సాహమెందుకు
*కోర్టు ఆదేశాలుంటే చర్చలు జరపరా..!
-పెద్దపల్లి ఎమ్మెల్యే,రామగుండం సీపీ విచారణ జరిపించాలి
-బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి
పెద్దపల్లి,ఏప్రిల్ 02:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
ఉగాది పండగరోజున పేద కుటుంబానికి చెందిన దేవరకొండ సత్యనారాయణ ఇంటిని పోలీసుల పహారాలో కూల్చివేయడాన్ని బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు.ఈ మేరకు ఆయన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుజ్జుల మాట్లాడుతూ సెలవుదినం నాడు కూల్చివేతలు చేయరాదని స్పష్టమైన నియమం ఉన్నప్పటికీ ఎలా కూల్చారని ప్రశ్నించారు.కూల్చే సమయంలో సంబంధిత మునిసిపల్ శాఖా అధికారులు ఉన్నారా అని నిలదీశారు.పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వాలని కూల్చివేత ఆదేశాల్లో ఎక్కడా పేర్కొనబడలేదని అలాంటి సందర్భంలో 50 మందికి పైగా పోలీసులు కూల్చివేతలో ఎలా పాల్గొన్నారని మండిపడ్డారు.ఇది కుల,మతాలకు సంబందించిన అంశం కాదని, మానవతాకోణంలో సమస్యను పరిష్కరించవలసి ఉండేనని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇరువర్గాలతో మాట్లాడి,ఒప్పించి ఇంటికూల్చివేతను ఆపవలసిన బాద్యత స్థానిక ప్రజాప్రతినిధులపై ఉంటుందని గుర్తు చేశారు.కోర్టు ఆదేశాలు లేకపోయినా కూల్చివేతకు సహకరించిన పోలీసు అధికారులపై నివేధిక తెప్పించుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రామగుండం పోలీసు కమీషనరుకు సూచించారు.ఇంటిని కూల్చివేయడం జిల్లాలో చోటుచేసుకున్న అతి అమానవీయ ఘటనగా ఆయన పేర్కొన్నారు.జరిగిన ఘటనపై బాద్యత వహిస్తూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సమాదానం చెప్పాలని,అలాగే విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయించాలన్నారు.వయసుమళ్ళిన వృద్ధ దంపతులను రోడ్డున పడవేసిన పాపం ఊరికే పోదని ఆగ్రహించారు.స్వార్థ రాజకీయాలకు సామాన్యుడు బలి అయ్యాడని,దీని వెనక ఉన్న రాజకీయశక్తులను ఎవ్వరినీ వదిలిపెట్టబోమని,బాధితులకు అండగా ఉంటామని వారికి న్యాయం జరిగే వరకు తోడుగా ఉంటామని భరోసా కల్పించారు.గూడు కూలగొట్టి గోసపెట్టిన పోలీసులప చర్యలు తీసుకొని,ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు కమీషనరు శాఖాపరంగా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవ రెడ్డి,నాయకులు పల్లె సదానందం,పర్శ సమ్మయ్య,వెల్లంపల్లి శ్రీనివాసరావు,శిలివేరు ఓదెలు,బెజ్జంకి దిలిప్ కుమార్,శివంగారి సతీష్,శాతరాజు రమేష్,మహేందర్ యాదవ్,కొమిరిశెట్టి రమేష్, ముస్త్యాల సంతోష్,మోర మనోహర్,మొలుగూరి రాజవీరు,అన్వేష్ యదవ్,తదితరులు పాల్గొన్నారు.
గూడు కూలగొట్టి గోసపెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి
Recent Comments
Hello world!
on