Friday, April 4, 2025
HomeUncategorized4న బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం

4న బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం

4న బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం
పెద్దపల్లి,ఏప్రిల్ 03:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను గ్రామ గ్రామాన నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా బుదవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పార్టీని విస్తరించేందుకు కోసం ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని ఈనెల 4న గోదావరిఖనిలోని సరస్వతి శిశుమందిరంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఇట్టి సమావేశానికి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే,జాతీయ కౌన్సిల్ సభ్యులు గుజ్జుల రామక్రిష్ణారెడ్డి,రాష్త్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్,కార్యక్రమాల రాష్ట్ర కమిటీ సభ్యులు ఎరబెల్లి రఘునాథరావు హాజరుకానున్నట్లు ఆయన వివరించారు.ముఖ్యకార్యకర్తల సమావేశానికి నాయకులు తరలిరావాలని సజీవరెడ్డి పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments