సన్న బియ్యంతో పేద ప్రజల జీవితాల్లో సంతోషాలు
– ఒకప్పుడు వరి అన్నం దొరకడం పండగ, నేడు సన్న బియ్యంతో ప్రతి ఇంట్లో ప్రతిరోజు పండగే
– మూడున్నర కోట్ల మందికి అన్నం పెట్టే ఈ పథకం చారిత్రాత్మకం : బీపీ నాయక్
– యావత్ భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శం
– పేద ప్రజల జీవితాల్లో ఆనందం కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం మరో ముందడుగు
బోనకల్ ఏప్రిల్ 01( ప్రజా కలం న్యూస్): ఒకప్పుడు వరి బియ్యం దొరికితేనే పండగ. కానీ ఇప్పుడు సన్న బియ్యం పంపిణీతో పేద ప్రజల జీవితాల్లో ప్రతిరోజు పండుగను తీసుకొచ్చింది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అని కాంగ్రెస్ యువ నాయకులు బీపీ నాయక్ అభిప్రాయపడ్డారు.
స్థానిక మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ చౌక ధరల దుకాణాలను బీపీ నాయక్ సందర్శించారు. పటిష్టమైన సన్న బియ్యం పంపిణీ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఉగాది పండగ పూట పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్ప నిర్ణయంతో ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లు, మిగతా మంత్రుల చేతుల మీదగా రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తూ ప్రజా ప్రభుత్వం పేదల పక్షపాతిగా మరోసారి నిరూపించుకుంది. అంత్యోదయ రేషన్ కార్డుదారులకు 35 కేజీలు, మిగతా వారికి తల ఆరు కేజీల చొప్పున రాష్ట్రంలో 85 శాతం మంది తెలంగాణ ప్రజల కడుపు నింపుతున్న ఈ బృహత్కార పథకం చారిత్రాత్మకమని కొనియాడారు.
ఆహార భద్రత పథకం, రేషన్ సరఫరా పథకం, ప్రజలకు 1.90 పైసలకే కిలో బియ్యం లాంటి అనేక సంస్కరణలతో పాటు ఉచిత సన్న బియ్యం పంపిణీ కూడా చరిత్ర సృష్టిస్తుందని అన్నారు. గత కెసిఆర్ పాలనలో నాణ్యమైన రేషన్ బియ్యానికి గతి లేదని, కెసిఆర్ తరచూ మాట్లాడుతూ హంగర్ ఇండెక్స్ లెక్కల ప్రకారం ఆకలి చావుల్లో తెలంగాణ ఉంది అంటూనే పేద ప్రజలకు నాణ్యమైన రేషన్ బియ్యం అందించడంలో విఫలమయ్యారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 11 నెలలోనే ప్రతి నెల 11 వేల కోట్లు ఖర్చు అయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల బ్రతుకులు మార్చాలి అన్న సంకల్పంతో కడుపునిండా అన్నం పెట్టే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. యావత్ భారత దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ మాత్రమే ఉంటుందని బిపి నాయక్ అన్నారు. సన్న ఒడ్లు రైతులకు ప్రోత్సాహకరంగా మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ 500 రూపాయలు ప్రకటించి రైతు బాంధవుడు, దార్శనీకుడిగా రేవంత్ రెడ్డి పేరు ప్రఖ్యాతలు గడిచారని అన్నారు. ప్రతిపక్షాలు పేదలకు అన్నం పెడుతున్న కార్యక్రమం పైన కూడా వివాదాస్పద విమర్శలు చేయడం రాజకీయాల్లో అత్యంత దిగజారుడుతనానికి నిదర్శనం అని అన్నారు. పేద ప్రజలు ఆనందంగా అన్నం తినే భాగ్యాన్ని కూడా ప్రతి పక్షాలు ఓర్వలేకపోతున్నారేమోనని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పలు కాంగ్రెస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
సన్న బియ్యంతో పేద ప్రజల జీవితాల్లో సంతోషాలు
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on