రౌడీ షీటర్లకు డీసీపీ కౌన్సెలింగ్
*ప్రవర్తన మార్చుకోకుంటే కఠిన చర్యలు
*రౌడీ షీటర్లకు డీసీపీ హెచ్చరిక
*రౌడీ షీటర్లకు డీసీపీ హెచ్చరిక
పెద్దపల్లి,ఏప్రిల్ 01:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
రౌడీ షీటర్లు తమ ప్రవర్తన మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ హెచ్చరించారు.మంగళవారం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన డీసీపీ,వారి జీవన విధానం,కుటుంబ పరిస్థితుల గురించి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా సత్ప్రవర్తనతో మెలగాలని రౌడీ షీటర్లకు సూచించారు.అనవసరమైన వివాదాల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేయడం మానుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రౌడీ షీటర్లు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని,కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని,ఏదైనా సమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలని,చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని డీసీపీ సూచించారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచుతామని, నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కౌన్సిలింగ్ లో పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ,పెద్దపల్లి సీఐ కె.ప్రవీణ్ కుమార్,ఎస్ఐలు జె.లక్ష్మణ్ రావు,బి.మల్లేశం,ధర్మారం ఎస్ఐ ఎస్.లక్ష్మణ్,బసంత్‌నగర్ ఎస్ఐ ఆర్.స్వామి పాల్గొన్నారు.
రౌడీ షీటర్లకు డీసీపీ కౌన్సెలింగ్
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on