Thursday, April 3, 2025
Homeజాతీయంధర్మరక్షణ కొరకు ప్రతీ ఒక్కడు హనుమంతుడై కదలాలి

ధర్మరక్షణ కొరకు ప్రతీ ఒక్కడు హనుమంతుడై కదలాలి

ధర్మరక్షణ కొరకు ప్రతీ ఒక్కడు హనుమంతుడై కదలాలి
*సనాతన హిందూధర్మమే సర్వజగద్రక్ష
*ధర్మద్రోహుల భరతం పట్టాలి..శ్రీశ్రీశ్రీ శాంతానందస్వామి
*వైభవంగా బజరంగదళ్ వీరహనుమాన్ విజయయాత్ర
పెద్దపల్లి,ఏప్రిల్ 01(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
కౌరవులు వందమంది ఉన్నప్పటికీ వారి అహంకారం వల్ల కేవలం అయిదుగురు ఉన్నపాండవుల చేతిలో ఓడిపోయారని,హిందూధర్మ ద్రోహులకు సైతం అదే గతి పడుతుందని పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శాంతానందస్వామి అన్నారు.విశ్వహిందూ పరిషత్ ఆద్వర్యంలో బజరంగదళ్ మంగళవారం చేపట్టిన వీరహనుమాన్ విజయయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ,ధర్మరక్షణ కొరకు ప్రతీ ఒక్కడు హనుమంతుడివలే కదలాలని పిలుపునిచ్చారు.సనాతన హిందూ ధర్మమే ప్రపంచానికి సర్వజగద్రక్షగా అభివర్ణించిన ఆయన, విశ్వవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మం వేగంగా విస్తరిస్తోందని,బలమైన ప్రాచీన మూలాలే ఇందుకు కారణమని పేర్కొన్నారు.అనేక యేళ్ళపాటు హిందూధర్మం పట్ల విషాన్ని చిమ్మిన పాలకుల అసలు నిజస్వరూపం బయటపడుతోందన్నారు.హిందూ ధర్మాన్ని మరిన్ని తరాలకు అందించేలా తమ కార్యచరణ ఉండబోతుందన్నారు.

కాశాయమయమైన పట్టణం
బజరంగదళ్ చేపట్టిన వీరహనుమాన్ విజయయాత్ర విజయవంతమైంది.జిల్లా వ్యాప్తంగా భారీగా తరలివచ్చిన కాశాయ కార్యకర్తలతో పట్టణం కాశాయవర్ణంగా మారింది.శోభాయాత్ర సందర్భంగా హనుమంతుడి ఉత్సవమూర్తి ప్రత్యేకంగా నిలిచింది. కార్యకర్తలు భారీగా తరలిరావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ శోభాయాత్రలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి,జిల్లా అధ్యక్షుడు స్వరూప్ కిరణ్ గౌడ్,కార్యదర్శి నాగులమల్యాల సత్యం,రాష్ట్ర నాయకులు అయోధ్య రవి,నగర కార్యదర్శి కొట్టె మహేందర్,బజరంగదళ్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్,బజరంగదళ్ పెద్దపల్లి నగర కన్వీనర్ బోలవేన మణిదీప్ యాదవ్,వేల్పుల రమేష్,సత్సంగ ప్రముఖ్ బొమ్మకంటి రవికుమార్, పెరిక శ్రీను,పొలం మహేష్,రైతు రాకేష్,గాండ్ల అభిరామ్,గుమ్మడి వంశీ,అఖిల్,గుమ్మడి సిద్దు, సాయి,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, నాయకులు పల్లె సదానందం,బెజ్జంకి దిలీప్ కుమార్,జంగా చక్రధర్ రెడ్డి,పెండ్యాల కరుణాకర్,వెళ్ళంపల్లి శ్రీనివాస రావు,పర్శ సమ్మయ్య,మౌటం నర్సింగ్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments