కాంగ్రెసులో కాక రగులుస్తున్న ఇంటికూల్చివేత
*సొంతపార్టీ నేతలపై ఘాటు విమర్శలు
*సారయ్యగౌడును పార్టీ నుండి సస్పెండ్ చేయాలి
*బాధితులను పరామర్శించిన మాజీ చైర్మన్ రాజయ్య
*టీపీసీసీ ప్రచార కార్యదర్శి భూషణవేన రమేష్ గౌడ్
పెద్దపల్లి,ఏప్రిల్ 03:(ప్రజాకలం జిల్లా ప్రతినిధి)
జిల్లాకేంద్రంలో సంచలనం సృష్టించిన పేద విశ్వబ్రాహ్మణుడి ఇంటి కూల్చివేత కాంగ్రెస్ పార్టీలో కాక రగులుస్తోంది.ఇంటిని కూల్చివేయడంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కాల్వశ్రీరాంపూర్ మాజీ జడ్పిటీసీ గోపగాని సారయ్య గౌడ్ హస్తం ఉందని సొంత పార్టీ నేతలు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు గురువారం బాధితుడు దేవరకొండ సత్యనారాయణ కుటుంబాన్ని పెద్దపల్లి మాజీ మునిసిపల్ చైర్మన్ ఎల్.రాజయ్య,టిపిసిసి ప్రచార కార్యదర్శి భూషణవేన రమేష్ గౌడ్ పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత సారయ్య గౌడ్ పై నిప్పులు చెరిగారు.పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పక్కనే ఉంటూ ఆయనకు చెడ్డపేరు తీసుకురావడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ ఘటనకు ఎమ్మెల్యేకు ఎలాంటి సంబందం లేదని రాజయ్య తేల్చి చెప్పారు.మాజీ ప్రజాప్రతినిధిగా బాధితుల పక్షాన న్యాయం చేయాల్సింది పోయి,పోలీసులను అడ్డం పెట్టుకొని ఇంటిని ఎలా కూలుస్తారని ప్రశ్నించారు.కోర్టు ఆదేశాల్లో ఎక్కడా పోలీసులు ప్రొటెక్షన్ చేయాలని లేదని,అలాంటప్పుడు పోలీసులకు ఎందుకంతంత అత్యుత్సాహమని నిలదీశారు.ఇందులో న్యాయవాదుల ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తపరిచారు.పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించిన కాంగ్రెస్ పార్టీ మాజీ జడ్పిటీసీ గోపగాని సారయ్య గౌడును పార్టీ నుండి సస్పెండ్ చేసేలా రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తామని సీనియర్ కాంగ్రెస్ నేత భూషణవేని రమేష్ గౌడ్ తెలిపారు. బాధితుల పక్షాణ చివరివరకు నిలుస్తామని,కులం పేరుతో రాజకీయాలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.వారివెంట కాంగ్రెస్ నాయకులు దోమల శ్రీనివాస్,అక్కపాక నరేష్,విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు విజయగిరి శ్రీనివాస్,కట్ట సదానందం,బసవపాత్రుని వెంకటనర్సయ్య,శ్రీరామోజు రాజు,విజయగిరి వెంకటేష్,కట్ట మనోహర్, బెజ్జంకి శ్రీనివాస్,కటుకోజ్వల రమేష్,ముత్తోజు రాజు,బస్వపాత్రుని శంకర్,జక్కోజు రమేష్,తదితరులు ఉన్నారు.
కాంగ్రెసులో కాక రగులుస్తున్న ఇంటికూల్చివేత
Recent Comments
Hello world!
on