రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్
– కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు..
– గులాబి జెండనే మా బలం అంటున్న జనం
– 27న వరంగల్ సభకు లక్షలాదిగా తరలిరావాలి
– శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద పాదయాత్రను ప్రారంభించిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి,
వలిగొండ ఏప్రిల్ 15 ప్రజాకలం:దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.వరంగల్ జిల్లా వేదికగా జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రను తిరగరాయబోతుందని,నేడు అన్ని రంగాల నోట కేసీఆర్ మాటే వినిపిస్తున్నదని,పదేండ్ల ఆయన పాలనలో అందిన ఫలాలనే అంతా గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ నిజమైన సైనికులుగా ఊళ్లకు ఊళ్లను కలుపుకొని ఈ నెల 27న రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.బహిరంగ సభ నేపథ్యంలో మంగళవారం మండల పరిధిలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వేములకొండ గుట్ట నుండి శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వరకు 27 వ తేదిన వరంగల్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న రజతోత్సవ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వల్లమాల కృష్ణ,బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్గు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్ర ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పాదయాత్రను మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డితో కలిసి
ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపు వాగ్దానాలను నమ్మి ఓట్లు వేసిన తెలంగాణలో వ్యవసాయం నాశనమైపోయి రైతులకు ఎడుపే మిగింలిందని,మహిళలు, కూలీలు,ఆటో కార్మికులు, యువజనులతోపాటు యావత్ తెలంగాణ సమాజం మోసపోయి గోసపడుతున్నదని,కేసీఆర్ పాలనే బాగుందని,కేసీఆర్ ఉంటే బాగుందని తెలంగాణ సమాజం చర్చించుకుంటుందన్నారు. 27వ తేదిన నిర్వహించే రజతోత్స మహసభ జయప్రదం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ విద్యార్ధి విభాగం,బీఆర్ఎస్ యువజన విభాగం చేపట్టిన మహాపాద యాత్ర విజయవంతం కావాలని,వరంగల్ మహాసభకు లక్షలాదిగా ప్రజలు,యువకులు, విద్యార్థులు తరలి వచ్చి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు మరింత శక్తిని అందించి జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిసీసీబీ మాజీ అధ్యక్షుడు గొంగడి మహేందర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,బూడిద బిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి,చింతల వెంకటేశ్వర్ రెడ్డి,క్యామ మల్లేశం,పైళ్ల రాజవర్ధన్రెడ్డి, మొగుళ్ల శ్రీనివాస్,బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సుర్కంటి వెంకట్ రెడ్డి,పనుమటి మమత నరేందర్ రెడ్డి,ముద్దసాని కిరణ్ రెడ్డి,పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఆఫ్రోజ్,కొమిరెలి సంజీవరెడ్డి,డేగల పాండరి,కునపూరి కవిత,మద్దెల మంజుల,పల్సం రమేష్,గూడూరు శేఖర్ రెడ్డి,నాగారం ప్రశాంత్,తొట స్వామి,జానీ తదితరులు పాల్గొన్నారు
రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్
Recent Comments
Hello world!
on