Friday, April 4, 2025
HomeUncategorizedమహేశ్వరం జెఏసి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉదృతం చేద్దాం

మహేశ్వరం జెఏసి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉదృతం చేద్దాం

మహేశ్వరం జెఏసి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉదృతం చేద్దాం
ప్రతి గ్రామం నుండి భారీ ఎత్తున బైక్ ర్యాలీతో కలెక్టర్ కు వినతి
ఫ్యూచర్ సిటీలో మహేశ్వరాన్ని కలిపి వరకు పోరాటం
నాయకులు అందరం చిత్తశుద్ధితో కలిసి పనిచేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం
మహేశ్వరం జేఏసీ ఆధ్వర్యంలో ఫ్యూచర్ సిటీపై సమీక్ష సమావేశం
మహేశ్వరం జేఏసీ చైర్మన్ వత్తుల రఘుపతి
మహేశ్వరం, ఏప్రిల్ 03, (ప్రజా కలం)
మహేశ్వరం మండల కేంద్రంలోని కర్నాటి మనోహర్ బిల్డింగ్ లోని జెఏసి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉదృతం చేద్దాం అని మహేశ్వరం జేఏసీ చైర్మన్త్తు వత్తుల రఘుపతి అలాగే జేఏసీ నాయకులు అన్నారు. మహేశ్వరం మండల కేంద్రం లో మహేశ్వరం జేఏసీ ఆధ్వర్యంలో ఫ్యూచర్ సిటీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్న 33 గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలపాలని కొద్దిరోజుల నుండి జే ఎ సీ ఆధ్వర్యంలో పోరాటం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గురువారం ఉదయం జే ఎ సి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని పార్టీల రాజకీయ నాయకులు పాల్గొన్నారు. మహేశ్వరం మండలంను ఫ్యూచర్ సిటీలో కలిపే వరకు అన్ని గ్రామాల నుండి ప్రజాప్రతినిధులతో ఉద్యమాల ఉధృతం చేస్తూ ఈనెల 7 తేదీన సోమవారం నాడు కలెక్టర్ వినతి పత్రం అంద చేయడం జరుగుతుంది అలాగే స్థానికంగా అన్ని గ్రామ ప్రజలకు తెలిసే విధంగా ఉద్యమ కార్యాచరణ సోషల్ మీడియా వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ అన్ని వేదికలను ద్వారా ప్రచారం చేయాలని జేఏసీ నాయకులు కోరారు.మహేశ్వరాన్ని కలిపితేనే భవిష్యత్తు ఉంటుందని తమ పిల్లల భవిష్యత్తు కోసం కలిపే వరకు పోరాటం చేస్తామని జె ఏసి నాయకులు ముక్తకంఠంతో ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. స్థానిక ఇన్చార్జి కేఎల్ఆర్. ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి. ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు అందరూ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని మరోసారి ఉద్యమాన్ని ఉదృతం చేస్తూ మహేశ్వరం సత్తా ఏంటో చూపించాలని జేఏసీ నాయకులు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ సీనియర్ జర్నలిస్టు వత్తుల రఘుపతి, జర్నలిస్టు యాదగిరి రెడ్డి . జర్నలిస్ట్ జగన్ రెడ్డి. కడారి జంగయ్య యాదవ్. చంద్రయ్య. అంద్య నాయక్. వర్కుల యాదగిరి గౌడ్. రాజు నాయక్. దత్తు నాయక్. సేవియా. ఉప్పుగడ్డ తండా రాజు నాయక్. కంది రమేష్. పాండు. నరసింహ,వి నరసింహ యాదవ్, జే ఎ సి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments