బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య
పెద్దపల్లి,ఏప్రిల్ 09:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
పెద్దపల్లి పట్టణంలోని టీచర్స్ కాలనీలో బుధవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.టీచర్స్ కాలనీకి చెందిన వేణుగోపాల్ రెడ్డి భార్య సాహితి (27) అనే మహిళ తన మూడు సంవత్సరాల కుమార్తె ప్రత్యూష రెడ్డిని హతమార్చి,అనంతరం ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం,సాహితి తన చిన్నారి బిడ్డను చంపి ఆ తర్వాత తను కూడా ఉరి వేసుకుంది.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య
Recent Comments
Hello world!
on