ఆస్తి పన్ను వసూళ్లలో మెట్ పల్లి మున్సిపాలిటీకి ప్రశంసా పత్రం
ప్రజల సహకారంతో దక్కిన గౌరవం
మున్సిపల్ కమిషనర్ టీ మోహన్
మెట్ పల్లి ప్రతినిధి, ఏప్రిల్ 03 (ప్రజాకలం)
:ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 10 మున్సిపాలిటీలలో మెట్ పల్లి మున్సిపాలిటీకి అవార్డ్, ప్రశంసా పత్రం లభించింది. కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చేతుల మీదుగా అందుకోవడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ మోహన్ తెలిపారు.2024-25 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను వసూలు లో మెట్ పల్లి మున్సిపాలిటీ రూ 3.94 కోట్లకు గానూ రూ 3.50 కోట్లు వసూలు చేసి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గానూ హైదరాబాద్ లో జరిగిన సమావేశ కార్యక్రమంలో కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీదేవి చేతుల మీదుగా అందుకోవడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ మోహన్ వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ఆస్తిపన్ను చెల్లించి మున్సిపల్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మోహన్ కృతజ్ఞతలు తెలిపారు.