పేదల ఆకలి తీర్చింది నాడు ఎన్టీఆర్…నేడు రేవంత్ రెడ్డి
*ప్రజా పాలన దరఖాస్తుల ఆధారంగా కొత్త రేషన్ కార్డులు
*దశలవారీగా ఇచ్చిన హామీలన్నీ తీర్చుతాం
-ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి,ఏప్రిల్ 03:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కిలో 2 రూపాయలకే బియ్యం పంపిణీ చేసి పేదల ఆకలి తీర్చారని,ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం అందిస్తూ మరో చరిత్ర సృష్టించారని
ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు కొనియాడారు.సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రి నగర్,మండలంలోని గర్రెపల్లి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే
విజయరమణ రావు మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు.ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి 3 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడినప్పటికీ,పేదల సంక్షేమం పట్ల ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ఆయన తెలిపారు.ప్రజా పాలనలో అందిన దరఖాస్తుల ఆధారంగా అర్హులైన వారందరికీ త్వరలోనే రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించిందని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు,రేషన్ కార్డులు,సన్న బియ్యం,కొత్త పింఛన్లు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.సన్న వడ్ల పంటలను ప్రోత్సహించడానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తామని చెప్పారు.పెద్దపల్లి నియోజకవర్గంలోనే అత్యధికంగా సన్న వడ్లు పండిస్తున్నారని తెలిపారు.ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను దశలవారీగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంటు,రూ. 500 కే గ్యాస్,సన్న బియ్యం పంపిణీ, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ,సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.గర్రెపల్లి గ్రామంలో 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు.శాస్త్రి నగర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.స్థానిక ప్రజల కోరిక మేరకు వారి కాలనీకి వెళ్లేందుకు ఉన్న రహదారి సమస్యను పరిష్కరించామని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్,మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరి మహేందర్,మాజీ సర్పంచ్ సాయిరి పద్మ,సింగిల్ విండో మాజీ చైర్మన్ జానీ, మాజీ ఎంపీటీసీ పులి వెంకటేశం,మాజీ సర్పంచ్ సత్యనారాయణ రావు,తహసీల్దార్,ఎంపీడీవో, అధికారులు,కాంగ్రెస్ నాయకులు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పేదల ఆకలి తీర్చింది నాడు ఎన్టీఆర్…నేడు రేవంత్ రెడ్డి
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on