నూతన గ్రామపంచాయతీ భవణ ప్రారంభోత్సవం
కాల్వశ్రీరాంపూర్,ఏప్రిల్ 05:(ప్రజాకలం ప్రతినిధి)మండలం మొట్లపల్లి గ్రామంలో ఎంజిఎన్ఆర్ ఈజిఎస్ 20 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని శనివారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాజీ సర్పంచ్ గొనే శ్యామ్,మాజీ వార్డ్ సభ్యులు,స్థానిక పంచాయతీ కార్యదర్శి రవీందర్ రెడ్డి నాయకులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ,పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని పరిపాలనకు అనుకూలంగా వుండేల గ్రామపంచాయతీల నిర్మాణానికి సహాహకరించిన ప్రజాప్రతినిధులకు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.గ్రామపంచాయతీ కార్యాలయాన్ని చక్కగా నిర్మించిన మాజీ సర్పంచ్ గోనె శ్యామ్ ను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో
ఎంపీడీవో పూర్ణచందర్,తాహసిల్దార్ జగదీశ్వరరావు,ఎంపీఓ ఆరిఫ్,ఎఈ జగదీష్,మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్,వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి,సింగల్ విండో చైర్మన్ చదువు రామచంద్ర రెడ్డి,నాయకులు గాజవేన సదయ్య,తులా మనోహర్ రావు,ఎండి.మునీర్,కోమల మల్లమ్మ,గడ్డం కొమరయ్య,మాజీ ఎంపిటిసి బోల మల్ల కౌసల్య శంకర్,గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
నూతన గ్రామపంచాయతీ భవణ ప్రారంభోత్సవం
Recent Comments
Hello world!
on