లారీ – కంటైనర్ ఎదురెదురుగా ఢీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు
డీఎస్పీ ఎస్ ఐ సమయస్ఫూర్తితో లారీ డ్రైవర్ కు తప్పిన ప్రాణాపాయం
మెట్ పల్లి ప్రతినిధి, ఏప్రిల్ 12 (ప్రజాకలం):మెట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున లారీ – కంటైనర్ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్ లో చిక్కుకున్నట్లు సమాచారం అందుకున్న మెట్ పల్లి డిఎస్పి రాములు, మెట్ పల్లి ఎస్సై కిరణ్ ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో పోలీసులు అతన్ని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా కరీంనగర్ నుండి మహరాష్ట కు లోడ్ చేసుకొని డ్రైవర్ పరదేశి తీసుకొని వెళుతుండగా మార్గమధ్యలో మెట్ పల్లి పోలిస్ స్టేషన్ దగ్గరలోని కెనాల్ బ్రిడ్జి పైకి చేరుకోగా ఎదురుగా లారీని ఢీకొనగా డ్రైవర్ పరదేశి కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయని, ప్రమాదానికి కారణమైన డ్రైవర్ రమేష్ చంద్ర దాఖర్ పై చర్యలు తీసుకోవాలని ట్రాన్స్పోర్ట్ సూపర్వైజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా డీఎస్పీ రాములు మెట్ పల్లి ఎస్ ఐ కిరణ్, ఇబ్రహీంపట్నం ఎస్ ఐ అనిల్ ల సమయస్ఫూర్తితో లారీ డ్రైవర్ కు ప్రాణాపాయం తప్పింది.