ఏప్రిల్ 14 వరకు రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు పొడిగింపు.జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
రాజీవ్ యువ వికాసం పథకంపై ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్.
ఖమ్మం, ఏప్రిల్ 01( ప్రజా కలం న్యూస్)
ఖమ్మం జిల్లా ప్రతినిధి ( రాయబారపు రమేష్ )
ఖమ్మం మంగళవారంరాజీవ్ యువ వికాసం పథకం క్రింద దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 14 వరకు గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.నిరుద్యోగ యువతపై పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తూ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశ పెట్టిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ యువకులకు సంబంధిత కార్పొరేషన్ల ద్వారా 100 శాతం సబ్సిడీ పై 50 వేల యూనిట్, 90 శాతం సబ్సిడీ పై లక్ష రూపాయల యూనిట్, 80 శాతం సబ్సిడీతో 2 లక్షల రూపాయల యూనిట్, 70 శాతం సబ్సిడీతో 4 లక్షల వరకు యూనిట్ లను యువకులు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వ సహకారం అందిస్తుందని అన్నారు.
చిన్న నీటి పారుదల రంగంలో యూనిట్ ఏర్పాటు చేసుకునే వారికి 100 శాతం సబ్సిడీ, దుర్బల సమూహాలకు లక్ష రూపాయల వరకు 90 శాతం సబ్సిడీ ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం పొందేందుకు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయ పరిమితి లక్షా 50 వేల రూపాయల లోపు, పట్టణ ప్రాంతాలలో రెండు లక్షల రూపాయల లోపు ఉండాలని, తెల్ల రేషన్ కార్డులో దరఖాస్తుదారుని పేరు లేని పక్షంలో మాత్రమే ఆదాయ సర్టిఫికెట్ సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.
వ్యవసాయేతర పథకాలకు అభ్యర్థుల వయస్సు 21 నుంచి 55 మధ్యలో ఉండాలని, వ్యవసాయ అనుబంధ రంగాల యూనిట్ల ఏర్పాటుదారులకు 60 సంవత్సరాల వరకు సడలింపు ఇవ్వడం జరిగిందని తెలిపారు. 5 సంవత్సరాలకు కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే ఉపాధి పథకం మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఆసక్తి గల అభ్యర్థులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణపత్రం, కుల ధృవీకరణ, రవాణా రంగ పథకాలకు శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, వ్యవసాయ పథకాలకు పట్టాదారు పాస్ పుస్తకం, దివ్యాంగులు సదరం సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దుర్బల సమూహ ధ్రువీకరణ మండల శాఖ కమిటీ ద్వారా జారీ చేసిన పత్రంతో పాటు ఆన్ లైన్ పోర్టల్ లో దరఖాస్తు చేయాలని అన్నారు.
లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత వారికి మంజూరు పత్రాలు జారీ చేయడంతో పాటు యూనిట్ గ్రౌండింగ్, వ్యాపార నిర్వహణలో పాటించాల్సిన సూత్రాలపై శిక్షణ కూడా అందిస్తామని, ఆసక్తిగల యువకులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఏప్రిల్ 14 వరకు రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు పొడిగింపు.
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on