రేషన్ బియ్యం పంచాయితీ మోదీ ఫోటోపై రగడ
పెద్దపల్లి,ఏప్రిల్ 02:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
పట్టణంలోని సుభాష్ నగర్‌లో జరిగిన ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది.కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుండగా,ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత కార్యక్రమంగా నిర్వహించింది.ముఖ్యమంత్రి,స్థానిక ఎమ్మెల్యే చిత్రపటాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, బియ్యం పంపిణీ చేశారు.అయితే,ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటం లేకపోవడంతో బీజేపీ,బీజేవైఎం నాయకులు ఉప్పు కిరణ్,కావేటీ రాజగోపాల్,పెంజర్ల రాకేష్,గుడ్ల సతీష్,సొల్లూరి మణికంఠ,పిట్ట వినయ్,మదుకర్ ఎమ్మెల్యే విజయ రమణారావు దృష్టికి తీసుకెళ్లారు.రేషన్ దుకాణాల వద్ద ప్రధాని మోడీ ఫోటో పెట్టక పొవడంపట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.పథకం కేంద్ర ప్రభుత్వానిది అయినప్పుడు,మోదీ చిత్రపటం ఎందుకు లేదని ఎమ్మెల్యే విజయ రమణారావును ప్రశ్నించారు.ఎమ్మెల్యే విజయ రమణారావు బదులిస్తూ కేవలం రాష్ట్ర ప్రభుత్వం రూ.2700 కోట్లు అదనంగా ఖర్చు పెట్టి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.సన్నబియ్యానికి కేంద్రానికి సంబంధం లేదని నచ్చజెప్పారు.ప్రధాని మోదీపై తనకు అభిమానం ఉన్నప్పటికీ,తెలంగాణకు కేంద్రం నిధుల విషయంలో వివక్ష చూపుతోందని ఎమ్మెల్యే ఆరోపించారు.రాష్ట్రానికి చెందిన బీజేపీ కేంద్ర మంత్రులు,ఎంపీలను ఈ విషయంలో ప్రశ్నించాలని బీజేపీ నాయకులకు హితబోధ చేశారు.తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చింది,ఇస్తుందో సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని బీజేపీ నాయకులకు సూచించారు.
రేషన్ బియ్యం పంచాయితీ మోదీ ఫోటోపై రగడ
Recent Comments
Hello world!
on