ప్రజాకలం కథనానికి స్పందన
*ప్రభుత్వ భూమిలో అక్రమ దర్గా నిర్మాణం
ప్రభుత్వ భూమి ఆక్రమణపై స్పందించిన అధికారులు
హెచ్చరిక బోర్డు ఏర్పాటు
పెద్దపల్లి,ఏప్రిల్ 05:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
పెద్దపల్లి పట్టణంలోని విష్ణుపురి కాలనీలో “ప్రభుత్వ భూమిలో అక్రమ దర్గా నిర్మాణం” అంటూ ప్రజాకలం దినపత్రికలో వచ్చిన కథనానికి పెద్దపల్లి రెవెన్యూ శాఖ అధికారులు స్పందించారు.సర్వే నంబర్ 891 పెద్దపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని ప్రభుత్వ స్థలమని,ఎవరైనా ఆక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ అధికారులు తాజాగా ఒక బోర్డును ఏర్పాటు చేశారు.ఈ మేరకు తహసీల్దార్ పెద్దపల్లి కార్యాలయం పేరుతో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు ప్రస్తుతం ఆ స్థలంలో దర్శనమిస్తోంది. సర్వే నెం.891 పెద్దపల్లి రెవెన్యూ గ్రామము ఇది ప్రభుత్వ స్థలము.ఎవరైనా ఆక్రమించినచో చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడును అని ఆ బోర్డుపై స్పష్టంగా పేర్కొన్నారు.కాగా,రాష్ట్రీయ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు జాపతి రాజేష్ పటేల్ ఈ అక్రమ నిర్మాణాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే.ఈ ఘటనపై ప్రజాకలం దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు వెంటనే స్పందించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడం గమనార్హం.అయితే,కేవలం హెచ్చరిక బోర్డు ఏర్పాటుతోనే సరిపెడతారా లేక అక్రమ నిర్మాణాన్ని తొలగించే దిశగా చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సి ఉంది.ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రజాకలం కథనానికి స్పందన
Recent Comments
Hello world!
on