టీడీపీ క్రియాశీల సభ్యత్వం అంటే ఓ గౌరవం
-జిల్లా మాజీ అధ్యక్షుడు అక్కపాక తిరుపతి
*కార్యకర్తలకు క్రియాశీల సభ్యత్వ కార్డుల అందజేత
పెద్దపల్లి,ఏప్రిల్ 09:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
పేద ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అంటే ఓ గౌరవమని తెదేపా పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు అక్కపాక తిరుపతి అన్నారు.తెదేపా క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకున్న కార్యకర్తలకు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం మాజీ జిల్లా అద్యక్షుడు అక్కపాక తిరుపతి కార్యకర్తలకు క్రియాశీల సభ్యత్వ కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా అక్కపాక తిరుపతి మాట్లాడుతూ తెదేపా కార్యకర్తల సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు.పార్టీలో కేవలం రూ.100 చెల్లించి సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు రూ.5 లక్షల బీమా సౌకర్యం లభిస్తుందని ఆయన ప్రకటించారు.పెద్ద సంఖ్యలో కార్యకర్తలు క్రియాశీల సభ్యత్వం తీసుకోవడం పట్ల సంతోషంగా ఉందన్నారు.తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో తెదేపా విజయం సాధించడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేసి పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు కోల కిషన్ రావు,కొప్పుల మురళి,పెరిక శ్రీనివాస్,విక్రమ్,పెరిక సుధాకర్,కోరపు సది,కుక్క శంకర్,కుక్క జ్యోతి, బొంకూరి శ్రీధర్,అస్లాం తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ క్రియాశీల సభ్యత్వం అంటే ఓ గౌరవం
Recent Comments
Hello world!
on