వరంగల్ రజతోత్సవ సభను సక్సెస్ చేయాలి.
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
మెట్ పల్లి: (కోరుట్ల) ప్రతినిధి, ఏప్రిల్ 15 (ప్రజాకలం): ఈ నెల 27వ తేదీన జరగబోయే రజతోత్సవ సభకు హాజరై సభను సక్సెస్ చేయాలని కోరుట్ల బీడీ కార్మికులను కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ ఆహ్వానించారు. ఈ సందర్బంగా కేసీఆర్ బీడీ కార్మికుల కష్టాన్ని గుర్తించి దేశంలోనే బీడీ కార్మికులకు జీవన భృతి ఇచ్చిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని వారికి గుర్తు చేసారు.మొదట బీడీ మహిళలకు 1000 పెన్షన్ ఇచ్చుకున్నట్లు పేర్కొన్నారు. తరువాత 2000 చేసుకున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వం వస్తే 4000 చేస్తుండే అని అన్నారు.కానీ దురదృష్టవశాత్తు కొందరి తప్పుడు ప్రచారాలతో కేసీఆర్ ప్రభుత్వం పోయిందని, మిగిలిన బీడీ కార్మికులకు కూడా పెన్షన్ అందించాలని ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరినట్లు వివరించారు. వచ్చేది మనమే అని అందరిని ఆదుకునేది కేసీఆరే అని తెలిపారు. కోరుట్ల పట్టణంలో పలు కుల సంఘ సభ్యులను కలిసి కేసిఆర్ రజతోత్సవ హాజరై విజయవంతం చేయాలని కోరారు.మహిళలందరూ కేసీఆర్ గారిని ఆశీర్వదించడానికి ప్రతి ఒక్కరు ఈ నెల 27వ తేదీన జరగబోయే వరంగల్ సభకు రావాల్సిందిగా విన్నపించారు.