రేషన్ షాపుల్లో సీఎం.. పౌర సరఫరాల శాఖ మంత్రి చిత్రపటాలని ఏర్పాటు చేయాలి
మెట్ పల్లి ప్రతినిధి, ఏప్రిల్ 02 (ప్రజాకలం): తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా రేషన్ షాపులలో సన్న బియ్యం కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని ఏడవ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్ జాకీర్ అన్నారు. అయితే ప్రభుత్వ రేషన్ షాపులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ షాపులలో చిత్ర పత్రం (ఫోటో) లు లేకపోవడం చాలా భాదకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. కోరుట్ల నియోజకవర్గంలో ప్రతీ రేషన్ షాపులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోటోలు కనిపించే విధంగా పెట్టడానికి తగు చర్యలు తీసుకోగలరని మెట్ పల్లి పట్టణ 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా అబ్దుల్ జాకీర్ మెట్పల్లి ఆర్డీవోకు ఇచ్చిన వినతి పత్రంలో కోరారు.